కర్ణాటక అధికార పీఠాన్ని అస్తగతం వెనుక కాంగ్రెస్ గ్రూపులలో కామ్ గా కాంప్రమైజ్ ?

క్షేత్రస్థాయి ప్రజాభిప్రాయ సేకరణలో పర్ఫెక్ట్ ప్లానింగ్


కర్ణాటక ఇంచార్జ్ మంథనిఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాయాజాలం


సీఎం అభ్యర్థి డీకే శివకుమార్ బుజ్జగింపు బాధ్యత శ్రీధర్ బాబుకా ?


J.SURENDER KUMAR,

దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రగతం వెనుక ఆ పార్టీలో కొంతకాలంగా కొనసాగుతున్న గ్రూపులు, విభేదాలను, ఉద్దండ నాయకుల మధ్య నెలకొన్న ఆదిపత్య కామ్ గా కాంప్రమైజ్ చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో అద్భుత విజయం వరించిందని చర్చ కొనసాగుతున్నది.

అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పై ప్రధానంగా 40 శాతం కమిషన్ల ఆరోపణ, నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు, తదితర అంశాల లో వ్యతిరేకత నెలకొని ఉన్న విషయం విధితమే.
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నియమించిన మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు, క్షేత్రస్థాయిలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో, ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఎన్నికల

మేనిఫెస్టోలో చేర్చడం కాంగ్రెస్ పార్టీ కమాండ్, రాష్ట్ర నాయకత్వం, పక్కాగా ఎన్నికల ప్రక్రియ ప్రణాళికకు శ్రీకారం చుట్టినట్టు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కింది అనే చర్చ నెలకొంది.


ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే స్వరాష్ట్రం, కే పి పి సి అధ్యక్షుడు హోదాలో డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, వర్గాలలో ఆదిపత్య పోరును ఆచితూచి అంచనా వేసి కాంగ్రెస్ హై కమాండ్ పంపించిన నివేదికల ఆధారంగానే.

ఏఐసీసీఅధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కే పి వేణుగోపాల్, రాహుల్ గాంధీ లు. నేరుగా వారితోనే సంప్రదించి వారి మధ్య విభేదాలను కామ్ గా కాంప్రమైజ్ చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులో విభేదాలను సమరస్యంగా వారి సమస్యల పరిష్కార బాధ్యతలను డీకే శివకుమార్, సిద్ధరామయ్య లకే అప్పగించినట్టు చర్చ.


ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక కీలక నాయకులు, పార్టీ మారకుండా, చర్యలు చేపట్టడంలో ఇద్దరు నాయకులు సఫలీకృతమైనట్టు చర్చ.

224 అసెంబ్లీ సెగ్మెంట్లలో 186 అసెంబ్లీ సెగ్మెంట్లలో. పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల బలాలు, బలహీనతలు, సామాజిక వర్గ నేపథ్యం, గెలుపోటములను ప్రభావితం చేయనున్న సామాజిక వర్గ ఓటర్ల వివరాలను. ఏప్రిల్ 20 నాటికి ఏఐసీసీ అధ్యక్షుడికి సమగ్ర నివేదిక పంపినట్టు చర్చ.

ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో మరో రెండు సంస్థల ద్వారా సర్వే చేయించుకున్న ఆ పార్టీ అధిష్టానం. మూడు నివేదికల ఆధారంగా.. అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసినట్టు చర్చ. కర్ణాటక ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రీధర్ బాబు, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన పథకాలు, స్థానిక నాయకుల్లో నెలకొన్న విభేదాలు తదితర అంశాల పై వచ్చిన ఫిర్యాదులపై ( కన్నడ, తులు, భాషలలో ) ట్రాన్స్లేటర్ ద్వారా సేకరించిన సమాచారం హై కమాండ్ నివేదికలు అందించినట్లు చర్చ.


సీఎం పదవి రేసులో ఉన్న కే పి పి సి అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య మధ్య నెలకొన్న పోటీలో డీకే శివకుమార్ ను నచ్చ చెప్పే బాధ్యతను ఏఐసీసీ దుగ్గిళ్ళ శ్రీధర్ బాబుకు అప్పగించినట్లు చర్చ కొనసాగుతున్నది

.