కొండగట్టు అంజన్న ఆదాయం కోటి 30 లక్షలు! నాలుగు రోజుల్లో, రోజుకు 32 లక్షల కు పై!

హనుమాన్ జయంతి సందర్భంగా.

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి వారికి హనుమాన్ జయంతి సందర్భంగా నాలుగు రోజుల్లో నే భక్త జనం ద్వారా ₹ 1,30,43,525/-భారీ ఆదాయం వచ్చింది. నాలుగు రోజులపాటు జరిగిన ఉత్సవాల్లో దాదాపు రోజుకు ₹ 32 లక్షల రూపాయలకు ఆలయానికి చేకూరింది. హుండీ లెక్కించాల్సి ఉంది.

శ్రీ ఆంజనేయ స్వామి కొండగట్టు లో 12/05/2023 నుండి 15/05/2023 వరకు జరిగిన శ్రీ స్వామివారి పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం ₹ 1,30,43,525=00
(వివిధ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయ )
దీక్ష విరమణ — ₹ 27,46,100=00
కేశఖండనo — ₹ 08,73,150=00
ప్రత్యేక దర్శనం — ₹ 15,68,500=00
లడ్డు ప్రసాదం ——-₹ 63,69,720=00
పులిహోర ప్రసాదం – ₹ 12,14,255=00
ఆర్జిత సేవల ద్వారా -₹ 2,71,800=00
మొత్తం ₹ 1,30,43,525=00

అభినందనలు…
శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు నందు తేది 12/05/23 నుండి 15/05/23 వరకు జరిగిన శ్రీ హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల విజయయోత్సవంలో భాగస్వాములు అయిన చొప్పదండి శాసన సభ్యులు సుంకే రవిశంకర్ జిల్లా కలెక్టర్ యాష్మిన్ భాషా అధ్యర్యంలో అన్ని శాఖల అధికారులకు జిల్లా SP ఆధ్వర్యం లో పోలీసు అధికారులకు పోలీసు సిబ్బందికి, మెడికల్ అధికారులకు, సిబ్బందికి, ఎలక్రికల్ అధికారులకు, సిబ్బందికి, మిషన్ భగీరథ సిబ్బందికి RTC సిబ్బందికి, రెవిన్యూ సిబ్బందికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కళాకారులకు,ఫైర్ సిబ్బందికి, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా కు, ప్రజాప్రతినిధులకు నాయకులకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఎండోమెంట్ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి మరియు భక్తులకు పెద్ద హనుమాన్ జయంతి నీ విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ దేవస్థానం పత్రికా ప్రకటన విడుదల చేసింది