ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్!

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులు యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా కనీస మద్దతు కల్పించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టిపిసిసి పిలుపు మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గo రైతులు, కాంగ్రెస్ శ్రేణులతో మంగళవారం జిల్లా కేంద్రంలో వేలాదిమంది రైతులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు.,వరి ధాన్యం కొనుగోలు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని, వరి వేయని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇందిరాభవన్ నుంచి కాంతి భవన్, వైశ్య భవన్, టవర్ సర్కిల్, కూరగాయల మార్కెట్ మీదుగా అంబేద్కర్ చౌరాస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. రెండు గంటల పాటు మహిళలు, రైతులు, పార్టీ నాయకులతో కలిసి జీవన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.


ఈసందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడంలేదని నెపం చూపుతూ కేసీఆర్ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని రైతులను ఇబ్బంది పెట్టడం మంచిదికాదాన్నారు.
రా రైస్, బాయిల్డ్ రైస్ మద్య 20 కిలోల నూక వస్తుందని నూక కిలోకు 15 రూపాయల చొప్పున క్వింటాలుకు 300 రూపాయలు కాగా రాష్ట్రంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే 15 వందల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని రైతులకోసం భరించలేవా అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్ రైతులను ఆదుకోవడానికి చేతులెతేయడం సరికాదన్నారు.
ఓట్ల కొనుగోలు, ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడానికి ఉన్నా డబ్బులు రైతులను ఆదుకోవడానికి లెవా అని కేసీఆర్ ను నీలాదీశారు.

వరి వేస్తే ఉరి అని రైతులకు చెప్పిన నీవు నీ వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో వరి పంట ఎందుకు వేశావాని, కేసీఆర్ ధ్వంద విధానాలను మానుకోవాలని హితవు పలికారు., చెరువులు, భావులు, ప్రాజెక్టుల్లో పుష్కళంగా నీళ్ళుండి రైతులు పంటావేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం దురదృష్టకరమన్నారు. అధికార పార్టీ ధర్నా చేయడం దేశ చరిత్రలో లేదని, ఢిల్లీలో ఉండి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి పియుష్ గోయేల్ లను కలువని ముఖ్యమంత్రి రైతులపట్ల కేంద్రంపై యుద్ధం చేస్తమానడం రైతులపట్ల మొసలి కన్నీరు కార్చడమేనని విమర్శించారు., రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం, ఢిల్లీలోనీ జంతర్ మంథర్ వద్ద కాకుండా రాష్ట్ర విశ్రాంతి భవనమైన తెలంగాణ భవన్ లో ఏసీలు, కూలర్లు పెట్టి రైతుల కోసమని ధర్నాలు చేయడమేమిటని ? జీవన్ రెడ్డి ప్రశ్నించారు.రైతుబంధు పేరు చెప్పి రైతులకు రావాల్సిన బ్యాంక్ రుణాలు, విత్తన,, ఉద్యనవన శాఖ, వ్యవసాయ శాఖ నుంసి రావాల్సిన రాయితీలను ప్రభుత్వం ఎత్తివేసిందని ఇదేనా రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ప్రేమా అని నీలాదీశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.


అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ కు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు విజయలక్ష్మి దేవందర్ రెడ్డి,గిరి నాగభూషణం, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్ళేపెల్లి దుర్గయ్య, ఎంపిపి మసర్థి రమేష్, కౌన్సిలర్లు నక్క జీవన్, కాంగ్రెస్ నేతలు దేవేందర్ రెడ్డి,గాజంగి నందయ్య, బండ శంకర్,మన్సూర్అలీ, నేహాల్, కొండ్ర రామచంద్ర రెడ్డి, రవీందర్ రావు, జున్ను రాజేందర్, గంగాధర్,రమేష్ రావు, కమాటాల శ్రీనివాస్, పరీక్షిత్ రెడ్డి, గంగా రెడ్డి,శంకర్హ,రీష్,
గుండా మధు, గోపు మాధవి, అల్లాల సరిత, బింగి సుమ, చిట్ల లత, రజిత, నరేష్, గంగాధర్, మొగిలి, రజినీకాంత్, మహిపాల్, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీఓ కార్యాలయానికి జీవన్ రెడ్డి, రైతులు, నాయకులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో గెట్ ముందు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, రైతులు బైఠాయించి పోలీసుల తిరు పట్ల నిరసన తెలిపారు. అధికార పార్టీ ధర్నా చేస్తే బందోబస్తూ నిర్వహించిన పోలీసులు, ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీనీ ఎందుకు అనుమతించరని ? జీవన్ రెడ్డి పోలీసుల తీరును తప్పుపట్టారు.15 నిమిషాలపాటు గేటు ముందు నిరసన తెలిపి ఆర్డీఓ తో జీవన్ రెడ్డి మాట్లాడడంతో లోనికి అనుమతించారు. ఆర్డీఓ కార్యాలయం ఏఓ కు వినతిపత్రం అందజేశారు.
ఈసందర్బంగా జీవన్ రెడ్డి ఏఓతో మాట్లాడుతూ మేము అనుమతి తీసుకొని వస్తే పోలీసులు మమ్ములను లోనికి రానీయకుండ అడ్డుకునీ ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు.
అధికార పార్టీ కీ, ప్రతిపక్ష పార్టీలకు ఒరకంగా చూడడం మంచిదికదాని, అధికారం ఎప్పటికి శాశ్వతం కాదన్నారు.


కోరుట్ల పట్టణంలో ..


రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా రైతు బాగు కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు గారి అధ్వర్యంలో కోరుట్ల లో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టారు నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలో జాతీయ రహదారిపై బస్టాండ్ వద్ద వందలాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో రైతులతో కలిసి భారీ నిరసన ధర్నా చేశారు

. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో టిఆర్ఎస్ పార్టీ అలాగే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల పట్ల ముఖ్యంగా రైతుల పట్ల తమ బాధ్యతను విస్మరించి వ రి ధాన్యం కొనకుండా రా రైస్ అని బాయిల్డ్ రైస్ అని రైతులను తీవ్ర నష్టాలకు గురి చేసి ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతుల కష్టాన్ని కార్పోరేట్ కంపెనీలకు దోచి పెట్టి పారిశ్రామికవేత్తలు అంబానీ ఆదాని లాంటి వారికి మేలు చేస్తున్నారని తద్వారా ఎన్నికల నిధులను సమీకరించడానికి రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారని జువ్వాడి అన్నారు… ముఖ్యమంత్రి వరి వేస్తె ఉరి అని అంటాడు మరి రైతు ఏ విధమైనటువంటి పంట పండించాలి.. వరి పండే భూమిలో వరి చెరకు తప్ప ఇంకే పంటలు పండవని చెప్తూ సీఎం కేసీఆర్ తన 150 ఎకరాల్లో వరి పండిస్తున్న ముఖ్యమంత్రికి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు..

దేశానికి రైతు వెన్నుముక అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రైతు వెన్నెముక ను వీరుస్తున్నారు అని తీవ్రంగా విచారం వ్యక్తం చేయడం జరిగింది.. ఈరోజు రైతులపై ముప్పేట దాడి చేసి వారి జీవన విధానం దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారని అలాగే కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం ముత్యంపేట లో ఉన్నటువంటి నిజాం చక్కెర కర్మాగారాన్ని మూసివేయించి రైతు లకు ఇంకా దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టివేశారని ఆరోపించారు..ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన వెంటనే ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వందరోజులలో నడిపిస్తామని పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన కవిత ఎన్నికలలో హామీ ఇచ్చారని ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఆ హామీని పూర్తిగా మర్చిపోయి నియోజకవర్గ రైతులను మోసం చేశారని మండిపడ్డారు…

2019 సంవత్సరంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ధర్మపురి అరవింద్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో తెరిపిస్తామనీ అలా కాని పక్షంలో తాను సొంత నిధులతో ప్రైవేటు రంగంలో ఫ్యాక్టరీ తీసుకొని నడిపిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేశాడని పసుపు కు ప్రత్యేకబోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లిస్తామని ఇచ్చిన హామీలు ఈరోజు వరకు నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెప్పిరైతులను ముంచి వేయాలని చూస్తున్నారని అన్నారు కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించని పక్షంలో తాను ఫ్యాక్టరీ గేటుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ప్రజల ముందు బహిరంగంగా వాగ్దానం చేశారని, ఆ వాగ్దానం సంగతి విద్యాసాగర్ రావు ఏరోజో గాలికి వదిలేశారని కృష్ణారావు ఆరోపించారు..

నియోజకవర్గంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కొనే నాథుడు లేక తీవ్ర దౌర్బాగ్యపరిస్థితి ఉంటే స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , టిఆర్ఎస్ నాయకులు, ఢిల్లీ వెళ్లి గంటన్నర దీక్ష చేసి ఫైవ్ స్టార్ హోటల్లో దిగి విందులు చేసుకుంటు న్నారని ఆరోపించారు.. కోరుట్ల నియోజకవర్గంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాల్సిన బాధ్యత స్థానిక శాసన సభ్యునిగా విద్యాసాగర్ రావు, స్థానిక పార్లమెంటు సభ్యుడిగా ధర్మపురి అరవింద్ పై ఉన్నదని ,ఈ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి క్షమించరాని నేరమని కృష్ణారావు హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ , డీజిల్ పై ధరలు పెంచి తద్వారా ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువు పైన ఈ రోజు నిత్యావసర వస్తువుల కానివ్వండి భవన నిర్మాణానికి ఉపయోగించే వస్తువు సామగ్రి కానివ్వండి మందులు కానివ్వండి మనం ఇతర వైద్య సౌకర్యాలకు సంబంధించినటువంటి పరికరాలు విపరీతంగా ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు..

రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి వేసి ఉత్పత్తి రంగం పై ఆ భారం వేసి అన్నింటి ధరలు పెరిగేలా చేస్తున్నారని ఈ విధంగా సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పాలించే హక్కు లేదని కృష్ణా రావు హెచ్చరించారు.


నిరసన కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతం రాజం,కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం రావు,జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ వాకిటి సత్యం రెడ్డి, మల్లాపూర్ మండలం కాంగ్రెస్ అద్యక్షులు పుండ్రా శ్రీను రెడ్డి, మెట్ పల్లి మండలం అధ్యక్షులు తిప్పి రెడ్డి అంజి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గం అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ జలపతి రెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు శశిందర్ రెడ్డి, ఎస్సీ సెల్ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు పసుల కృష్ణా ప్రసాద్, సిడిసి మాజీ చైర్మన్ కంది బుచ్చి రెడ్డి, కోరుట్ల పట్టణ ప్రధాన కార్యదర్శి బన్న రాజేష్, తుపాకుల భాజన్న, వెంపెట్ ఉప సర్పంచ్ ప్రవీణ్, కిసాన్ సెల్ మెట్ పల్లి, కోరుట్ల పట్టణ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, అమరేందర్, మహిళా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల అధ్యక్షురాలు శ్రీమతి సోగ్రబి, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్, నాయకులు వెంకటేష్ గౌడ్, పట్టణ కార్యదర్శి మ్యాకల నర్సయ్య, దండవేని వెంకటేష్, రామ్ ప్రసాద్, మరిపెల్లి జనార్ధన్, డా.రమేష్ , మోహన్ రెడ్డి, పుండ్ర శ్రీనివాస్ రెడ్డి , మాజీ ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ ఉపధ్యక్షుడు నబీ,కోరుట్ల పట్టణ మాజీ అధ్యక్షుడు అక్బర్, మాజీ ఉప సర్పంచ్ రహీమ్, జనిల్ ,గ్రామ శాఖ అద్యక్షుడు చిట్టి బాబు, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి ముహమ్మద్ నసీర్ మరియు కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి భారీ ఎత్తున రైతులు నిరసన ధర్నాలో పాల్గొనడం పాల్గొన్నారు.


ధర్మపురిలో..


తక్షణం వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి !
డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ !

రాయపట్నం జాతీయ రహదారిపై


.తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి,ధాన్యం సేకరణలో ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి, అంటూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం రాయపట్నం జాతీయ రహదారి పై ఆయన కాంగ్రెస్ శ్రేణులు నాయకులతో కలిసి రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఆస్పష్ట వైఖరి విధానం కారణంగా అన్ని అవకాశాలు ఉండి కూడా సాగు చేయబడని 15 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరానికి 10 వేల రూపాయలు రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఎండగట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దాన్యం కొనుగోలు చేయకుండా అధికార పార్టీ ఢిల్లీలో ధర్నాలు ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన హేళన చేశారు. ధర్నా లో ధర్మపురి, వెల్గటూర్, గొల్లపెళ్లి, బుగ్గరం,.ధర్మారం, పెగడపెళ్లి .మండల అధ్యక్షులు సంఘనభట్ల దినేష్, టి.శైలేందర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, వేముల సుభాష్ , ఆవుల శ్రీనివాస్, రాములు ,వేముల రాజేష్, సింహరాజు ప్రసాద్, ,కుంట సుధాకర్, రందేని మోగిలి, రవీందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సిపతి సత్యనారాయణ, ఎండి రఫియోద్దీన్ కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.