సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగుంటుంది!

J.Surender Kumar.
జ్యోతిష్య విశ్లేషణ!!

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండవని, ఏదైనా సమస్య ఉంటే అది తాత్కాలికమే, అని ధర్మపురి క్షేత్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితుడు గొల్లపల్లి సంతోష్ శర్మ విశ్లేషించారు. శుక్రవారం సీఎం కేసీఆర్ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో యశోద ఆసుపత్రికి వెళ్లడం, వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య సమస్యలపై, వివిధ రకాల పరీక్షలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించడం, సీఎం కేసీఆర్ కు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేవని స్పష్టం చేసిన విషయం విధితమే.

” 2014 సంవత్సరంలో ఎన్నికల ఫలితాలకు ముందస్తుగానే కెసిఆర్ కు పదవి యోగం ఉందని,” “2017 డిసెంబర్లో 2019 లోనూ సీఎం కేసీఆర్ . హవా కొనసాగుతుందని” ముందస్తుగా జ్యోతిష్య పండితుడు సంతోష్ శర్మ విశ్లేషించి చెప్పడం ప్రస్తావనార్హం.
ప్రస్తుతం గురువు , మరియు శని, గోచారం అనుకూలంగా లేకపోవడంతో వ్యక్తిగతంగా, రాజకీయంగా, కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏప్రిల్ మాసం నుంచి గురువు, 9 ఇంటిలో రాహువు, అనుకూలంగా ఉంటుందని, 7వ స్థానంలో శని, గోచార కారణంగా రాజకీయ ప్రత్యర్థులు, నిరంతరం ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేయడంతో , కెసిఆర్ చేసే పనులు కూడా కొంతమేరకు ఆటంకాలు ఏర్పడతాయని, ఆయన వివరించారు. ఏప్రిల్ నుంచి గురు, అత్యంత అనుకూలంగా 9న ఇంట ఉండడం, ఏప్రిల్ చివరి వారం నుంచి, జూలై మాసం మధ్యలో శని ,గోచారం 8వ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో, సీఎం కేసీఆర్ ,ఆరోగ్య పరమైన విషయంలో, కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ,గురువు దృష్టి, లగ్నం పై ఉండటం వల్ల, ఈ సమస్యల పై ఇబ్బందులు ఏర్పడే అవకాశాలను కెసిఆర్, జాతక కుండలి నేపథ్యంలో వివరించాల్సి వచ్చిందన్నారు. రాహు దశలో,సూర్య అంతర్దశ, అంతగా అనుకూలించదు. కేతు, గోచారం శని, గోచారం అంతగా అనుకూలంగా ఉండకపోవడంతో, ఈ రెండు గ్రహాల పరిహారం, కోసం గణపతి ,సంబంధమైన మరియు హనుమాన్, పూజలు చేయడంతో ఆయనకు రాజకీయ, ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయని సంతోష్ శర్మ వివరించారు. కెసిఆర్ జాతక కుండలి నేపథ్యంలో ఆయన మహర్దశ జాతకుడు అని శర్మ వివరించారు.