మహారాష్ట్ర మహాలక్ష్మి – సన్నిధిలో కేసీఆర్ దంపతులు !!

J.Surender Kumar,

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్‌ లోని శ్రీ అంబాబాయి మహాలక్ష్మీ అమ్మవారి దర్శనార్ధం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ఉదయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ బయలుదేరి వెళ్లారు.

హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా విమానంలో కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, మధ్యాహ్నం కొల్హాపూర్ లోని శ్రీ అంబాబాయి మహాలక్ష్మీ ఆలయానికి చేరుకోగా, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

ఆలయంలో కార్వీర్ నివాసిని శ్రీ అంబాబాయి మహాలక్ష్మి అలంకార పూజలో సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ , నమస్తే తెలంగాణ ఎండి దీవకొండ దామోదర్ రావు , టి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

అమ్మవారి దర్శనానంతరం సీఎం కేసీఆర్ మాజీ గవర్నర్ డి వై పాటిల్ ఆయన మనుమడు ప్రస్తుత స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రుతు రాజ్ పాతిల్ తో ముచ్చటించారు.

కెసిఆర్ ని చూడడానికి భక్తజనం పోటీ పడ్డారు ఆలయ విశిష్టత ప్రాచీన కట్టడం తదితర అంశాలు సీఎం అక్కడి అర్చకులు వేద పండితులను అడిగి తెలుసుకున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం అం చివరి క్షణం వరకు గోప్యంగా ఉంచడంతో పాటు సాయుధ పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.