కొండగట్టు క్షేత్రానికి 31న సీఎం కేసీఆర్ రాక ?

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు 31 న పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి రానున్నట్లు సమాచారo. పర్యటన అధికారికంగా ఖరారు అయితే, సీఎం హోదాలో మొదటిసారి కెసిఆర్ ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. మంగళవారం సాయంత్రం కొండగట్టుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవి, ఎస్పీ సింధుశర్మ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, చేరుకొని సీఎం పర్యటన ఏర్పాట్ల పై సమీక్షించారు.

హెలిప్యాడ్, ఆలయ పరిసరాల ప్రాంతాల వీక్షణ కై , రూట్ మ్యాప్ ,పలు స్థలాలను గుర్తించి పరిశీలిస్తున్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వచ్చి స్వామివార్లను దర్శించుకునీ , ఆలయ అభివృద్ధి పై సమీక్ష చేసే అవకాశం ఉన్నదని , కెసిఆర్ పర్యటన సందర్భంగా గుడి సమీపంలో పార్కింగ్ స్థలంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అక్కడ నుండి సి.ఎం. కేసీఆర్ ఆలయానికి, దారి మార్గం లో వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికార యంత్రాంగానికి సమాచారం అందడంతో ఆ దిశగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత, ఆర్డిఓ మాధురి , ఎండోమెంట్, ఆర్ అండ్ బి అధికారులతో పలు శాఖల అధికారులు జగిత్యాల డిఎస్పీ ప్రకాష్, మల్యాల తహసిల్దార్ సుజాత, సీఐ రమణ మూర్తి, ఎస్ఐ చిరంజీవి తదితర యంత్రాంగం కొండగట్టు మకాం వేసి స్థల పరిశీలన చేస్తున్నారు.


నాడు ముడుపుకట్టి – నేడు సీఎం హోదాలో !
31 సీఎం కేసీఆర్ కొండగట్టు క్షేత్రానికి వచ్చే శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటే, 2004 -5 కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో ఆయన క్షేత్రానికి వచ్చి అంజన్నకు ముడుపు కట్టారని సమాచారం. సీఎం కేసీఆర్ క్షేత్రానికి దీక్ష మండపం విరమణ నిర్మాణం కు రెండు కోట్ల యాభై లక్షలు, మెట్ల దారి నిర్మాణానికి రెండు కోట్ల యాభై లక్షలు, శ్రీ రామకోటి నిర్మాణానికి దాదాపు 70 లక్షల రూపాయలు నిధులు కేటాయించారు. వేములవాడ, ధర్మపురి క్షేత్రాల అభివృద్ధి కోసం కోట్లాది నిధులు కేటాయించిన విషయం విధితమే. స్వర్గీయ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డినీ కొండగట్టు క్షేత్రాన్నికి ఆహ్వానించారు. నాడు సీఎం హోదాలో, వైఎస్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు, అనంతరం నాచుపల్లి లోని JNTU నా కళాశాలను వైఎస్ ప్రారంభించారు.