పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు !!

అంగరంగ వైభవంగా జరుగనున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవానికి,ప్రభుత్వ పక్షాన కలెక్టర్ గుగులోతు రవి దంపతులు, ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు, తలంబ్రాలను మంగళవారం సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులకు అందజేశారు.


ఈనెల 13 నుంచి 26 వరకు జరగనున్న లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధానోత్సవం, ముగ్గురు స్వాములు కళ్యాణం ఈరోజు సాయంత్రం గోధూళి ముహూర్తంలో స్థానిక శేషప్ప కళా వేదికపై, అంగరంగ వైభవంగా జరుగనున్నది. ప్రభుత్వ పక్షాన ధర్మపురి ఆలయమునకు పట్టు వస్త్రాలు, సమర్పించే సంప్రదాయం స్వర్గీయ మాజీ దేవాదాయ శాఖ మంత్రి మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు హయంలో 2009 మార్చి మాసంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయించారు..

పట్టు వస్త్రాలు తెస్తున్న కలెక్టర్ దంపతులకు, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, కమిషనర్, కౌన్సిలర్లు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్, అభివృద్ధి కమిటీ సభ్యులు రామయ్య తో పాటు పాటు 12 మంది సభ్యులు,వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ, హరి, రాజు, సంతోషం ,అర్చకులు నంబి శ్రీనివాస్ చార్యులు, నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, రమణయ్య తదితరులు ఇసుక స్తంభం మంటపం వద్ద కలెక్టర్ దంపతులకు మేళతాళాల మంగళవాయిద్యాల, వేద మంత్రాలతో ఘనంగా స్వాగతం పలికి కలెక్టర్ దంపతులకు పూలమాలలు వేశారు. కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని సాంప్రదాయ పద్ధతిలో కాలినడకన ఆలయం చేరుకొని స్వామి వారలకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఆలయ.పక్షాన కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించి, స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలను వారికి అందజేశారు . బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఉచిత అన్నదానం, దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రాలు కలెక్టర్ ప్రారంభించారు. జగిత్యాల ఆర్డీవో, మాధురి, స్థానిక ఎమ్మార్వో వెంకటేశం తదితర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


అక్రిడేషన్ కాలపరిమితి పొడగింపు.
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు కాలపరిమితిని మరో మూడు నెలలు పొడగిస్తూ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఐఏఎస్ అధికారి ,అరవింద్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31కి అక్రిడేషన్ కాలపరిమితి ముగియనున్నది. లేక సంఖ్య 5852/M/2022 ద్వారా 30/06/2022 వరకు ( మూడు నెలల కాలం పాటు) పొడగిస్తూ, జిల్లాల సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టిసి బస్సు పాసులు, రైల్వే పాసుల కాలపరిమితి నీ సైతం పొడగించాలని ఆర్టిసి ఎండి కి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు, కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.