జగిత్యాలలో ఫోక్స్ కోర్టు, లైబ్రరీ బిల్డింగ్ ప్రారంభం!!

J.Surender Kumar.

జగిత్యాల కోర్టు లో కాసుగంటి లక్ష్మీ నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్  కాసుగంటి లక్ష్మణ్ కుమార్  జగిత్యాల కోర్టు ఆవరణలో సుమారు ఒక కోటి 20 లక్షల రూపాయలు తో లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణం చేశారు. లైబ్రరీ బిల్డింగ్ మరియు పొక్సో  కోర్టు లను  తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు  జస్టిస్ పునుగోటి నవీన్ రావు, మరియు  జస్టిస్ డాక్టర్ షమీం అక్తర్ , డిజిటల్ పద్ధతిలో ప్రారంభోత్సవం చేశారు.

  ప్రారంభోత్సవ కార్యక్రమం లో హైకోర్టు జడ్జి  జస్టిస్ పి నవీన్  రావు ,మాట్లాడుతూ ఇంతటి సుందరమైన విశాలమైన భవనాన్ని జగిత్యాల లైబ్రరీ బిల్డింగ్ కొరకు నిర్మాణం చేపట్టి ఇచ్చినందుకు శ్రీ కాసుగంటి లక్ష్మణ్ కుమార్ కు అభినందనలు  తెలిపారు.  హైకోర్టు జడ్జి  జస్టిస్  షమీం అక్తర్ ,పోక్సో చట్టం గురించి విపులంగా వివరించారు.  కాసుగంటి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ  ఇంతకు ముందే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేపట్టినామని మరియు భవిష్యత్తులో చేపడుతామని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాధ పిల్లలకు కూడా స్కాలర్షిప్  అందజేస్తున్నామని ,పేదవారికి సేవ చేయడంలో  ఎప్పుడూ ముందే ఉంటాం అని తెలియజేశారు. 

జగిత్యాల కోర్టులో న్యాయవాద వృత్తిలో యాభై వసంతాలు ప్రాక్టీస్ పూర్తి చేసుకున్నటువంటి న్యాయవాదులు అయిన శ్రీ నామ మురళీధర్ రావు ,  శ్రీ ముదిగంటి జనార్దన్ రెడ్డి , లను జగిత్యాల బార్ అసోసియేషన్ పక్షాన సన్మానించారు. కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీమతి ప్రియదర్శిని,   రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి సుదర్శన్,  తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ ను జగిత్యాల బార్ అసోసియేషన్ తరపున సన్మానించారు.
ఈ కార్యక్రమంలో   కరీంనగర్ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎంజీ ప్రియదర్శిని, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి సుదర్శన్ ,జగిత్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి నిహారిక, రెండవ అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వినీల్ కుమార్ , ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి ప్రమీలా జైన్, మెట్పల్లి జూనియర్ సివిల్ జడ్జి శ్యామ్ కుమార్, తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ , మరియు జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాండ్ర సురేందర్, ప్రధాన కార్యదర్శి కటుకం చంద్రమోహన్ , సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు  జగిత్యాల శాసనసభ్యులు ఏం సంజయ్ కుమార్, జగిత్యాల కలెక్టర్ గుగులోత్ రవి జగిత్యాల అడిషనల్ ఎస్పీఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


ఫ్లాష్ ఫ్లాష్
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ సమావేశం
హాజరైన మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్ యాదాద్రి, ఇతర అంశాలపై చర్చించే అవకాశం


ఏపీలో…
RRR సినిమా టికెట్ ధర పెంపుకు ఉత్తర్వులు జారీ !
గత కొంత కాలంగా సినీ నిర్మాతలకు ,డిస్ట్రిబ్యూటర్లకు సినిమా రేట్లు వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సినీ నటుడు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి జోక్యంతో డిస్ట్రిబ్యూటర్లు ,నిర్మాతలు, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్రముఖ దర్శకుడు రాజమౌళి నిర్మించిన RRR సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తో ఇటీవల రాజమౌళి సమావేశం పరిస్థితిని బడ్జెట్ తదితర అంశాలను వివరించారు. ఈ నేపథ్యంలో ఈనెల 18న ఏపీ ప్రభుత్వం కొన్ని నిబంధనలతో , కొన్ని రోజుల పాటు కొన్ని సెంటర్లలో, టిక్కెట్ ధరలను, పెంచుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

A.P లో R R R సినిమా టికెట్ ధర పెంపుకు ఉత్తర్వులు.