దళిత బంధు యూనిట్లు గ్రౌండ్ చేయండి-కలెక్టర్ రవి!

జగిత్యాల మార్చి 30:- జిల్లాలో మొదటి విడత దళిత బందు యూనిట్లను ప్రణాళికాబద్ధంగా గ్రౌండ్ చేయాలని జిల్లా కలెక్టర్ జీ. రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. దళిత బందు యూనిట్ల గ్రౌండింగ్ అంశం పై కలెక్టర్ బుధవారం సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.

జిల్లాలో దళిత బంధు పథకం కింద మొదటి విడత లో 5 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 346 మంది లబ్ధిదారులను జిల్లా మంత్రి ఆమోదంతో ఎంపిక చేసి అందులో 12 మంది లబ్ధిదారులకు రూ.19.5లక్షలు ప్రాధమికంగా బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు అధికారులు వివరించారు. నియోజకవర్గాల వారీగా దళిత బంధు యూనిట్ల ఏర్పాటు పై అవగాహన సదస్సులు నిర్వహించామని, అనంతరం లబ్ధిదారులు యూనిట్ లను ఫైనల్ చేశారని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం జగిత్యాల జిల్లా కు రూ.23 కోట్ల నిధులు దళిత బంధు పథకం కింద విడుదల చేసిందని, మార్చి 31లోగా వీలైనంత మేర యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా ప్రత్యేక అధికారులు సర్వీసెస్, రిటైలర్ షాప్స్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్, వ్యవసాయ అనుబంధ సెక్టార్ లబ్ధిదారులకు ఫోన్ చేసి యూనిట్ గ్రౌండ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్న వారిని గుర్తించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వ్యవసాయ సెక్టార్ , రవాణా సెక్టర్ కింద ట్రాక్టర్లు, కార్లు , వివిధ రకాల వాహనాలు ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల వారి అర్హత డ్రైవింగ్ లైసెన్స్ ధృవీకరించాలని, వారికి అవసరమైన వాహన వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారుల నుంచి దళిత బందు యూనిట్ ఎంపికపై అంగీకార పత్రం సేకరించాలని కలెక్టర్ అధికారులకు తెలియ చేశారు. జిల్లాలో దళిత బంధు లబ్ధిదారులు నూతన బ్యాంకు ఖాతాలను ప్రారంభించారని, సదరు ఖాతాల నుంచి అధికారుల ఆథారేషన్ లేనిది నగదు విడుదల చేయడానికి వీలులేదని కలెక్టర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ సూచించారు. దళిత బందు లబ్ధిదారుల దరఖాస్తులను మండల స్థాయి కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా స్థాయి కమిటీకి అందజేయాలని కలెక్టర్ సూచించారు.
పథకం అమలులో భాగంగా అధికారులు చేసిన కృషిని కలెక్టర్ అభినందించారు, లబ్ధిదారుల ధ్రువీకరణ యూనిట్ల ఏర్పాటు పై అవగాహన కల్పన వివరాల సేకరణ వంటి పనులు పకడ్బందీగా పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు.
దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ మరో కీలక అంశమని, దీనిని సైతం అప్రమత్తంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వ్యవసాయ సెక్టర్, రవాణా సెక్టార్ నుంచి వాహనాలు యూనిట్ గా ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల అర్హతలు పరిశీలించాలని ,వారికి అవసరమైన వాహనాల వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కమిటీ సదరు వాహనాల కంపెనీల ప్రతినిధుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు కృషి చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. రిటైల్ షాప్ సెక్టార్ కింద ఎంపిక చేసుకున్న యూనిట్ల కోసం అనువైన స్థలం అందుబాటులో ఉందో లేదో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. మండలాల వారిగా కమిటీలకు జిల్లా నుంచి దళిత బంధు పథకం కింద ప్రతిరోజు నిధుల విడుదల సమాచారం సెక్టార్ ల వారీగా అందజేస్తామని, సదరు యూనిట్ల క్షేత్ర స్థాయి పరిస్థితి పరిశీలించి నివేదిక ఎప్పటికప్పుడు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్. లత, ఇంచార్జి ఆదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మాధవి , ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు సంబంధించిన అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.