గోవింద నామస్మరణతో మారుమోగిన క్షేత్రం.

ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ !!

ధర్మపురి జాతర ఉత్సవాలలో ప్రధానోత్సవం శ్రీ యోగ నరసింహస్వామి వారి, తెప్పోత్సవం, డోలోత్సవం తో కోనేరు ,ధర్మపురి క్షేత్రం ,శుక్రవారం గోవిందనామ స్మరణ లతో మారుమోగింది.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. పుష్కరిణిలో తెప్పోత్సవా హంసవాహనంపై స్వామివారి ఉత్సవ మూర్తుల ను ఉంచి ఐదు ప్రదక్షిణాలు నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు, ఆలయ కార్యనిర్వాహణాధికారి, శ్రీనివాస్, అభివృద్ధి కమిటీ సభ్యుడు రామయ్య , మంత్రి ఈశ్వర, స్వామి వెంట వాహనంలో ప్రదక్షణాలు చేశారు. అనంతరం స్వామి వారు పుష్కరిణి మధ్యలో గల మంటపం పై ఆశీనులు గావించి డోలోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.

వేలాది మంది భక్తులు ,పుష్కరిణి నలువైపుల గల మెట్లపై కూర్చుండి తన్మయత్వంతో అపురూప మనోహరమైన దృశ్యంను వారు తిలకించారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి క్యూ లైన్ నిలబడి మంటపం మధ్యలో కి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ ,ముత్యాల శర్మ, అర్చకులు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఘనంగా వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ ,జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ, తదితర ప్రజాప్రతినిధులతో పాటు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికార యంత్రాంగం మంత్రి వెంట ఉన్నారు.


సీఎం కేసీఆర్ కు ఇష్టమైన క్షేత్రం !!
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో సీఎం కేసీఆర్, 2003లో ఈ క్షేత్రంలో యాగం నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర వచ్చిన వెంటనే ధర్మపురి క్షేత్ర, అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తానని కెసిఆర్ నాడు ప్రకటించారు అని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ ఈ క్షేత్రంను అపురూప క్షేత్రంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు అని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.. ఇచ్చిన మాట ప్రకారం కోట్లాది నిధులు ఈ క్షేత్ర , ఆలయ అభివృద్ధికి కేటాయించారని, పనులు జరుగుతున్నాయన్నారు. భక్తుల సౌకర్యాల కల్పన కోసం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక మున్సిపల్ కమిషనర్, ఇతర ప్రజా ప్రతినిధులు,దేవాలయ అధికారులు,సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని వారిని కొనియాడారు.

కార్యక్రమానికి ముందు మంత్రి స్వామివారి పల్లకి నీ మోశారు. స్థానిక పోలీసు బలగాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోనేటి నీటిలో భద్రత చర్యలు చేపట్టారు, వీరితో పాటు స్థానిక బోయ సంఘం యువకులు, గజ ఈతగాళ్లు, వీరితో పాటు అప్రమత్తంగా ఉన్నారు. భక్తజనం తొక్కిసలాట జరగకుండా కోనేటి నాలుగు వైపుల గల ద్వారాల వద్ద పోలీసులు ,హోంగార్డులు , భద్రత చర్యలు చేపట్టారు. కోలాటాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య శ్రవణానందం, నయనానందం గా, దృశ్యం భక్తజనం కు అగుపించింది. ఈ కార్యక్రమం ఆసాంతం పాలెపు చంద్రశేఖర శర్మ, ప్రత్యక్ష వ్యాఖ్యానం తో పుష్కరిణి , తెప్పోత్సవం,డోలోత్సవ విశిష్టతను మైక్ ద్వారా వివరించారు. స్థానిక ఎస్.ఆర్.ఆర్ కేబుల్ నెట్వర్క్ వారు ప్రత్యక్ష ప్రసారాన్ని చేపట్టారు.

One thought on “గోవింద నామస్మరణతో మారుమోగిన క్షేత్రం.

  1. బాగుంది మిత్రమా సురేందర్. రోజూ పత్రిక చూస్తూ స్థానిక వార్తలు eppatikappu తెలుసుకుంటున్నా.

Comments are closed.