వైభవంగా ధర్మపురి నరసింహుడి కళ్యాణం!

ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి జాతర ఉత్సవాలు ప్రధాన ఉత్సవం శ్రీ స్వామివారి కళ్యాణం మంగళవారం గోధూళి సుముహూర్తాన ఆలయ ప్రాంగణం లోని శేషప్ప కళా వేదికపై అంగరంగ వైభవంగా జరిగింది.  స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో. జగిత్యాల జిల్లా కలెక్టర్ గూగుల్ లోతు రవి దంపతులు, మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మ పతి స్నేహలత,  . స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి సంగీ సత్యమ్మ, కమిషనర్ రమేష్, కౌన్సిలర్లు , ధర్మపురి బుగ్గారం జడ్పిటిసి సభ్యులు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్ , ధర్మపురి,బుగ్గారం ఎంపీపీలు, చిట్టి బాబు, బాదినేని రాజమణి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు,తదితర ప్రముఖులు భారీగా భక్తజనం తరలివచ్చారు.


స్వామివారికి తలంబ్రాలు !!
స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి స్వామి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, మంగళ వాయిద్యాలు మేళతాళాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపత్ని స్నేహలత,మున్సిపల్ కమిషనర్ రమేష్ ,కౌన్సిలర్ బండారి అశోక్ లు    ఆలయం వరకు తరలి వెళ్లి అర్చకులకు అందజేశారు

ప్రముఖ ప్రవచకులు, శృంగేరి పీఠం ఆస్థాన విద్వాంసులు డాక్టర్ బాచుపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పాల్గొని స్వామివారి కళ్యాణం  తీరు , ఆవశ్యకత, హిందూ ధర్మ విశిష్టత గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు.  ఒకే వేదికపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగడం ఈ క్షేత్రం ఈ ప్రాంత ప్రత్యేకత అంటూ ఆయన వ్యాఖ్యానం చేశారు. వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ  హరి, దిలీప్ శర్మ, కొరిడె విశ్వనాథ శర్మ, కాసర్ల వంశీకృష్ణ. మధు మహదేవ్. అర్చక స్వాములు నంబి శ్రీనివాసాచార్యులు , నేరెళ్ల శ్రీనివాసాచార్యులు వంశీ, పాలెపు ప్రవీణ్ శర్మ,   బొజ్జ కుమార్, సంతోష్ శర్మ , కందాల పురుషోత్తం ఆచార్యులు. నంబి నరసింహమూర్తి, తదితర వేదపండితులు అర్చకస్వాములు వేదమంత్రాల ఘోషతో మంగళ వాయిద్యాలు కన్నుల పండువగా నిర్వహించారు. సాయంత్రం 6-35  నిమిషాలకు కు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం 8 గంటల 22 నిమిషాలకు మంగళసూత్రధారణ వరకు ఘనంగా కొనసాగింది.  

పోటెత్తిన భక్తజనం!
ధర్మపురికి మంగళవారం తెల్లవారుజాము నుంచి స్వామి వారి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. గోదావరి నదిలో స్నానాలు చేసి స్వామివారి దర్శనం కోసం భక్తజనం బారులు తీరారు. బస్టాండ్ నుంచి నంది విగ్రహం వరకు నంది విగ్రహం నుంచి ఆలయం వరకు భక్తజనం పోటెత్తారు.స్థానిక ఎస్.ఆర్.ఆర్ కేబుల్ నెట్వర్క్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆలయ అధికారులు ,సిబ్బంది, పోలీస్ అధికారులు, పోలీస్ వర్గాలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.