హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రణాళిక బద్దంగా జరగాలి. కలెక్టర్- G. రవి

జగిత్యాల- ప్రణాళికబద్ధంగా కొండగట్టులో చిన్న హనుమాన్ ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహణపై కలెక్టర్ శనివారం చొప్పదండి ఎమ్మెల్యే, ఆలయ ధర్మకర్తల చైర్మన్ తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ముందుగా స్వామి వారిని దర్శించుకొని పూజలో పాల్గొన్నారు.


ఏప్రిల్ 14 నుంచి 18 వరకు కొండగట్టు ప్రాంతంలో చిన్న హనుమాన్ ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని, దీనికోసం పక్కా కార్యాచరణ రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉత్సవ సమయంలో దేవాదాయశాఖ ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల కోసం ప్రసాదం విక్రయ కేంద్రాలు, కేశఖండన కేంద్రాలు , ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం క్యూలైన్లు ఏర్పాట్లు చేయాలని, 3 షిఫ్ట్ లో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
వేసవి దృష్ట్యా 50 పైగా చలివేంద్రాలు ఆలయానికి వచ్చే మార్గాల్లో ,ఆలయం చుట్టుపక్కల ఏర్పాటు చేసి చల్లని త్రాగు నీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు చిన్న హనుమాన్ ఉత్సవాల నిర్వహణ కోసం పనిచేసే పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బందికి భోజనం, వసతి అందించాలని కలెక్టర్ సూచించారు. ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల ఫ్లెక్సీ ల ద్వారా సహాయక ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు ఎప్పటికప్పుడు నీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు దాతల ద్వారా అందించాలని తెలిపారు. చిన్న హనుమాన్ ఉత్సవాల కోసం బారికేడ్ గ్రిల్స్ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ 12 వరకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొండగట్టు ఆలయానికి వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని, ఉత్సవ నిర్వహణ సమయంలో ప్రతిరోజూ కోనేరులో నీటి విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొండ పై పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని, ఉత్సవ సమయంలో అవసరమైన మేర అదనపు సిబ్బందిని నియమించాలని కలెక్టర్ సూచించారు. ఉత్సవ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు కల్పించాలని కలెక్టర్ పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు

. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.10 లక్షలను వెంటనే ఆలయ కమిటీ కి విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు సీసీ కెమెరాల కోసం అవసరమైతే మరో పది లక్షలను విడుదల చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆలయ పరిసరాల్లో భక్తుల అవసరాల మేరకు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలనే కలెక్టర్ పేర్కొన్నారు. చిన్న హనుమాన్ ఉత్సవాలకు నిరంతరాయంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉత్సవాల కోసం నిర్వహించే విద్యుత్ అలంకరణ పరిశీలించాలని అవసరమైన మేర అదనపు ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. దేవాలయాల అవసరాల నిమిత్తం, భక్తులు స్నానాలు నిర్వహించడానికి ఇతర అవసరాలకు అవసరమైన మేర నీరు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో ఆలయ ప్రాంగణం , పరిసరాలలో 5 ప్రదేశాలలో ఆరోగ్య సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, 24 గంటలు వైద్యుడు, సిబ్బంది మందులతో అందుబాటులో ఉండే విధంగా మూడు షిఫ్టులు నియమించాలని కలెక్టర్ సూచించారు. వేసవి దృష్ట్యా వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధిక సంఖ్యలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆలయ చుట్టుపక్కల పెద్ద ఎత్తున అడవి ఉందని, ఉత్సవ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 350 పై సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహించాలనే డివిజనల్ పంచాయతీ అధికారి కలెక్టర్ సూచించారు.


చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 15,16,17 రోజులలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. యాదాద్రి నిర్మాణంతో కేసీఆర్ అద్భుతాన్ని ఆవిష్కరించారని ఎమ్మెల్యే తెలిపారు. కొండగట్టు ఆలయం కార్యాలయాన్ని రూ.2 కోట్ల 50 లక్షలతో నిర్మించామని, అదేవిధంగా మెట్ల మార్గం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2.5 కోట్లను మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. మెట్ల మార్గం కోసం మరో రెండున్నర కోట్లు ప్రతిపాదనలు పంపమని, 7 ఈ రోజుల్లో మెట్ల మార్గం టెండర్ పనులు పూర్తిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. భక్తుల దీక్ష విరమణ స్థలం కోసం 2.5 కోట్లతో మండపం నిర్మించామని, 80 లక్షలతో శ్రీ రామ కోటి స్తూపం చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఉత్సవ నిర్వహణ సమయంలో తప్పనిసరిగా పెద్ద ఎత్తున వాలంటీర్లను అందుబాటులో ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత కీలకమని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎక్కడెక్క ఏమి ఏర్పాట్లు చేయాలో ఆలయ ప్రాంగణంలో అధికారులు తో కలిసి స్వయంగా తిరిగి పరిలించి తగు సూచనలు, చేసారు. జగిత్యాల ఎస్ పి సింధు శర్మ, అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ధర్మకర్తల మండలి చైర్మన్ టీ మారుతి ,ఆలయ ఉప కమిషనర్ టీ వెంకటేష్, సంబంధిత జిల్లా అధికారులు, తహశీల్దార్లు అధికారులు, జెడ్పిటిసిలు, సర్పంచ్ లు , ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు