ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కు ఘన సన్మానం !

L.M కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో

J. Surender Kumar,

గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉగాది సంబరాల్లో భాగంగా గురువారం ప్రముఖ సినీ దర్శకుడు గబ్బర్ సింగ్ ఫేమ్ సంగనభట్ల హరీష్ శంకర్ ను ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘనంగా సన్మానించారు.. హరీష్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రి ఆయనకు తినిపించారు.

గత నెల 29 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్న ఉగాది ఉత్సవాల సంబరాల్లో భాగంగా ఆయనకు ప్రతిభా పురస్కారాన్ని ఎల్ ఎం కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి ప్రధానం చేశారు. సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఎల్ ఎం కోపుల ట్రస్ట్ వారు ఆహ్వానించడం నన్ను సన్మానించడం మరిచిపోలేని రోజు నేను ధర్మపురి క్షేత్రావాసులకు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు తను సాక్షాత్తు శ్రీ లక్ష్మీనరసింహస్వామి పిలిచి పుట్టినరోజు వేడుకలు జరిపించారు అని భావిస్తున్నాను అన్నారు.

స్వగ్రామం ధర్మపురికి వచ్చిన హరీష్ శంకర్ ను బంధుమిత్రులు అభిమానులు ఘనంగా స్వాగతించారు. స్థానిక దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినీ హరి శంకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పక్షాన ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, సభ్యులు, ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రామ్ చిత్రపటాన్ని అందించారు. వేద పండితులు ఘనంగా ఆశీర్వదించారు.

పట్టణంలోని జిమ్ సభ్యుల ఆహ్వానం మేరకు జిమ్ కు వెళ్ళిన హరీష్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా సభ్యుల కేక్ కట్ చేయించారు, కొద్దిసేపు ఆయన జిమ్ చేశారు. అనంతరం హరీష్ శంకర్ తన కుటుంబ సభ్యులను, బంధుమిత్రులు ఇళ్లల్లోకి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాల వేడుకల వేదిక వద్దకు చేరుకొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి హరి శంకర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో మంత్రి కొప్పుల ఈశ్వర్, .ఎం.కొప్పుల ట్రస్ట్ చైర్ పెర్సన్ శ్రీమతి కొప్పుల స్నేహాలత, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్. రమణ., జిల్లాలోని ఎమ్మేల్యేలు డా. సంజయ్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సుంకె రవి శంకర్., జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, ధర్మపురి తెరాస నాయకులు బోయినపల్లి ప్రశాంత్ రావు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.,

హరీష్ శంకర్ కు అమెరికా నుంచి అభినందనల వెల్లువ!!

వివిధ వృత్తుల నేపథ్యంలో అమెరికా దేశంలో నివాసముంటున్న ధర్మపురి వాసులు హరీష్శంకర్ రాక సందర్భంగా ఆయనను అభినందనలు పరంపరలో ముంచెత్తుతూ…. “” జంతువులకు ఆకలి భౌతికం , మనిషి ఆకలి భౌతికం, మానసికం కూడా ! ఒక ఆకలి తీరినా ఇంకో ఆకలి తనను నిద్ర పోనివ్వదు! ఇంకో ఆకలి మనముందు నిలిపిన అద్భుతం పేరు “హరీష్ శంకర్ “! అలా మేధోమధనంతో , వెనుక ఎవ్వరు లేకుండా, ఎంచుకున్న రంగంలో తన కుటుంబం లేకున్నా , ” నేను సంగనభట్ల హరీష్ శంకర్ ను “, అని ఉవ్వెత్తున లేచిన కడలి తరంగం, శ్రీ హరీష్ శంకర్ , శిల తనను తాను చెక్కుకుని శిల్పం కావటం అసాధ్యం కాదు, దానికి నేనే ఒక ఉదాహరణ అని, తన తెలివితేటలతో, అద్భుత చలనచిత్ర ఇంద్ర జాలికుడైన హరీష్, మనముందే నిరూపించారు ! యండమూరి నవలలతో, ఆయన రాసిన పర్సనాలిటీ development పుస్తకాలతో, తాతయ్య శ్రీ మాణిక్య శాస్త్రి గారి అద్భుత పౌరాణిక వారసత్వ సంపదతో, అమ్మానాన్నల భయాలను పటాపంచలు చేస్తూ, చుట్టూ ఉన్న ప్రతి ముళ్లబాటలను దాటుకుంటూ, కృషితో, జ్ఞ్యానంతో, కలుపుగోలుతనంతో, అందరికి తనవాడై, అందరిని తనవాళ్లను చేసుకుని, చలనచిత్ర రంగంలో పూలబాటలు ఏర్పరుచున్న నిత్య కృషీవలుడితడు ! “షాక్ ““మిరపకాయ్”, “దువ్వాడ జగన్నాథం”, “గబ్బర్ సింగ్”, “రామయ్యా వస్తావయ్యా “, “ సుబ్రమణియమ్ ఫర్ సేల్ “, “గద్దలకొండ గణేష్ “ ఇలా ప్రతిచిత్రం పేరు నుండి, కథ, కథనం, అద్భుత సంభాషణలు, హాస్యం, మెలోడ్రామా, మంచి సంగీతం తో అన్నికోణాల్లో నవరసాల పిండివంటకాల రుచి తెలుగువాళ్లందరికి చూపిన గొప్ప కళాకారుడు! ఇవేకాక “నా ఆటోగ్రాఫ్”, “ ఏ ఫిలిం బై అరవింద్ “ లాంటి ఎన్నో చిత్రాలకు co-రైటర్ గా , నటుడిగా కూడా పనిచేసి మెప్పించిన సవ్యసాచి ! “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి “ ప్రపంచమెంత మెచ్చుకున్నా, కన్నతల్లితండ్రులు, పుట్టిన ఊరు, మెప్పుపొందటం ఒక అదృష్టం ! LM కొప్పుల సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఉగాది సంబరాలు – పురస్కారాలు “భాగం గా ఈ రోజు మూడవ రోజు,ధర్మపురి వాస్తవ్యుడు సినీ దర్శకులు సంగనభట్ల హరీశ్ శంకర్ కు సన్మాన కార్యక్రమం జరగటం ఆయనకు, కుటుంబానికి, ధర్మపురికి, తెలుగువాళ్లందరికి ఒక అద్భుత క్షణంగా మిగిలిపోతుంది! హరీష్ శంకర్ పేరులో హనుమంతుడి (హరీష్) పరాక్రమం, తన శక్తియుక్తులు తనకే తెలియని విద్యార్ధి తత్త్వం , పరమశివుని (శంకర్ ) నిష్కల్మషత్వం, భోళాతనం, అందరి మంచి కోరుకునే శివతత్వం ఉన్నాయి ! ఇవే గుణాలున్న , సార్థక నామధేయుడైన, ఈ మట్టిలో పుట్టిన “మాణిక్యం”, ధర్మపురి లక్ష్మీ నరసింహుడి కృపతో , అమ్మలగన్న అమ్మ బాలా త్రిపురసుందరి కరుణావీక్షణాలతో , ఇంకా ఎన్నో అద్భుత విజయాల ను సొంతం చేసుకుంటున్న హరీష్ శంకర్ ” వన్ మాన్ ఆర్మీ” గా చెప్పక తప్పదు తప్పదు అంటూ అభినందనలు సందేశం సోషల్ మీడియాలో అమెరికా నుంచి కే.మాధవ్ మిత్ర బృందం పంపించారు.

One thought on “ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కు ఘన సన్మానం !

  1. ఆనందం దాయకం.ఆశీః .హైదరాబాద్ లో కూడా సన్మానం ధర్మపురి వాళ్ళు పూనుకోవాలి.

Comments are closed.