జర్నలిస్టులకు శిక్షణ తరగతులు- చైర్మన్ అల్లం నారాయణ!

J.Surender Kumar,

హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాసబ్ ట్యాంక్, ఆడిటోరియంలో ఈనెల 26, 27 తేదీలలో షెడ్యూల్ కులాల, జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ముఖ్యఅతిథిగా పాల్గొని, శిక్షణ శిబిరం ప్రారంభిస్తారని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులు సందేశం, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీల ప్రసంగాలు, పిదప 3 గంటలకు, సీనియర్ జర్నలిస్టు, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి,మల్లేపల్లి లక్ష్మయ్య, జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు, దళిత బంధు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ,పై అవగాహన కలిగిస్తారని వివరించారు. సాయంత్రం 5 గంటల వరకు సీనియర్ జర్నలిస్టు బుర్ర శ్రీనివాస్, డిజిటల్ మీడియా పై అవగాహన కల్పిస్తారని వివరించారు. 27 న ఉదయం 11 గంటలకు, సీనియర్ జర్నలిస్టు చిల్ల మల్లేశం, పత్రిక భాష తప్పుల దిద్దుబాటు పై వివరిస్తారు ,మధ్యాహ్నం 12 గంటలకు ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి,దళిత జర్నలిస్టుల ప్రత్యేకత, అస్తిత్వంలో జర్నలిజం లో దళితుల భాగస్వామ్యం, పాత్ర అనే అంశంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు గోవిందరెడ్డి ,నేర వార్తలు అంశంపై శిక్షణ ఇస్తారు, పగలు 3 గంటలకు సీనియర్ జర్నలిస్టు బుచ్చన్న, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో పరస్పర అవగాహన ,తదితర అంశాలపై వివరిస్తారని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న జర్నలిస్టులకు సర్టిఫికెట్లను ప్రధానం చేస్తారు ,ఉమ్మడి 9 జిల్లాలలో పౌర సంబంధాల శాఖ కార్యాలయం(DPRO) లో షెడ్యూల్ కులాల జర్నలిస్టులు, తమ పేర్లను ముందస్తుగా నమోదు చేసుకోవాలని ,అల్లం నారాయణ ,అకాడమీ కార్యదర్శి N.వెంకటేశ్వరరావు మేనేజర్, A. వనజ ప్రకటనలో పేర్కొన్నారు.