J.Surender Kumar,
చిత్తూరు జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నామని దేవస్థాన అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో వినాయక మూలవిరాట్ దర్శనం, భక్తులకు ఇక రెండు రోజులు మాత్రమేనని తెలిపారు. స్వామివారి ఆలయాన్ని రీమోడల్ చేస్తున్న నేపథ్యంలో గర్భాలయాన్ని దేవస్థానం మూసివేయనుంది. మళ్ళీ స్వయంభు వినాయకుడి మూలవిరాట్ పునః దర్శనం ఆగష్టు 31వ తేదీ వినాయక చవితి రోజు నుంచి మళ్ళీ భక్తులకు అందుబాటులోకి దేవస్థానం తీసుకుని రానున్నట్లు ఆలయ పాలకవర్గం చైర్మన్ మోహన్ రెడ్డి, మరియు ధర్మకర్తలు, కార్య నిర్వహణ అధికారి, (డిప్యూటీ కలెక్టర్) ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే అప్పటి వరకూ తాత్కాలికంగా స్వామివారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో బాల వినాయక ఆలయాన్ని దేవస్థానం నిర్మించింది. ఈ ప్రత్యేక బాల విఘ్నేశ్వరుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించి అనంతరం భక్తులకు సోమవారం నుంచి దర్శనం కలిగేలా చర్యలు తీసుకోనున్నారు.
