రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే అని నమ్మినవాడు… ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు… కాబట్టి ఆయన అడుగులేం ఆశ్చర్యపర్చకపోయినా.. ఆయన తీసుకోబోయే నిర్ణయాలేంటన్నవీ అంతుచిక్కకపోయినా… ఆయన క్యాంప్ నుంచి వచ్చే లీకులపై కూడా ఓ ఆసక్తికరమైన ఉత్సుకతను నింపే చర్చకైతే తావివ్వవడంలో… తెలంగాణా రాష్ట్రంలో ఇప్పుడు సీఎం కేసీఆర్ తర్వాతే ఇంకెవ్వరైనా! కాదు కాదు ఆ దరిదాపుల్లోనే ఎవ్వరూ లేరు కనుకే..ఇప్పుడాయన ఒకేఒక్కడు!!
సింగ్ ఈజ్ కింగ్….
మాజీ మేయర్… టీఆర్ఎస్ నుంచి కార్పోరేటర్ పదవి నుంచి మేయర్ గా ఓ అడుగు ముందుకు వేసినవాడు… సర్దార్ రవీందర్ సింగ్ ఎపిసోడ్ తర్వాత రవీందర్ సింగ్ హైలైట్ అవ్వడం కంటే కూడా ఎక్కువగా మళ్లీ సీఎం కేసీఆరే అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. ఎందుకంటే తనకు పలుమార్లు సీఎం కేసీఆర్ తో పాటు… మంత్రి కేటీఆర్ కూడా సభల సాక్షిగా ఎమ్మెల్సీ చేస్తామని చెప్పి… మాట తప్పారంటూ… ఎందరో తిరుగుబాటుదారుల్లాగే సర్దార్ రవీందర్ సింగ్ కూడా తిరుగుబావుటా ఎగురేశాడు. ఏకంగా తానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఆ క్రమంలో ఇప్పుడేపేరైతే చెబితే కేసీఆర్ భగ్గుమంటాడో… అదిగో ఆ ఈటెల రాజేందర్ నుంచి మొదలుకుంటే… బీజేపి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలందరినీ కాలికి బలపం కట్టుకుని తిరిగి మరీ కలిశాడు. తాను బరిలోకి దిగిన స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులెందర్నో కలిశాడు. తన ప్రయత్నాలు తాను చేశాడు. మొత్తంగా టీఆర్ఎస్ కూ… సీఎం కేసీఆర్ కూ… కేటీఆర్ కూ వ్యతిరేకంగా ఓ క్యాంపెయిన్ నడిపించాడు. ఆ క్రమంలో కరీంనగర్ లో అంతవరకూ కలిసున్న తన సహచర టీఆర్ఎస్ నేతలే రవీందర్ సింగ్ ను దుమ్మెత్తిపోయడమూ… ఆరోపణలూ, ప్రత్యారోపణలన్నీ జనమంతా చూసిందే!
మొత్తంగా రవీందర్ సింగ్ ఎపిసోడ్ చూసిన సాధారణ జనానికి… ఇక రవీందర్ సింగ్ పరిస్థితీ ఓ మాజీ ఎంపీ రవీంద్రనాయక్ లాగానో.. లేక, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమలాగానో… ఓ కొండా విశ్వేశ్వర్ రెడ్డీలాగానో… ఓ దుగ్యాల శ్రీనివాస్ రావులాగానో… ఓ మందాడి సత్యనారాయణ తరహానో… ఓ స్వామిగౌడో, లేక ఓ జితేందర్ రెడ్డి మాదిరో… టీఆర్ఎస్ తో తెగదెంపులైపోయినట్టేనని అంతా భావించారు. కానీ… అనూహ్యంగా ఏదైతే కేసీఆర్ చేయడానికి ఇష్టపడడో… అదే చేశాడు. తనను తిట్టిపోసిన రవీందర్ సింగ్ ని… తాను నిలబెట్టిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్ గా వ్యవహరించిన ఓ కార్పోరేటర్ ని మాత్రం.. అంతకుముందు తనతో తెగదెంపులు చేసుకున్న నేతలకు భిన్నంగా దగ్గరకు తీశాడు. దువ్వాడు. అసలేదైతే కేసీఆర్ చేయడో… అదే చేయాల్సి రావడంలోఆంతర్యమేంటన్నదే ఇప్పుడు చర్చ! పైగా రవీందర్ సింగ్ తనను కేసీఆరే ఆహ్వానించినట్టు… ప్రెస్ నోట్స్ విడుదల చేయడం మరింత చర్చకు తావిచ్చింది!!
అసలు రవీందర్ సింగ్ కేసీఆర్ విడిచిన బాణమా ? అన్న అనుమానాలు వచ్చినా… అలాగైతే చిట్టచివరికైనా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన నామినేషన్ ను రవీందర్ సింగ్ ఉపసంహరించుకోవాలి. కానీ, అలా జరగలేదంటే… కచ్చితంగా రవీందర్ సింగ్ వ్యతిరేకించిన మాటా నిజం… కేసీఆర్ కొంత తగ్గి దిగివచ్చిన మాటా అంతకన్నా నిజమనే చర్చకు ఆస్కారమేర్పడింది. ఎందరో మహామహులను కూడా లైట్ గా తీసుకునే కేసీఆర్… సింగ్ ను మాత్రం మళ్లీ దరి చేర్చుకోవడానికి గల కారణాలేంటన్న అన్వేషణ ఇప్పుడు ఏ నల్గురు రాజకీయంగా చర్చించుకున్నా వచ్చి తీరుతోంది. మరి రవీందర్ సింగ్ కోవర్టా ? .. లేక, గూఢచారా ? ఏమనుకోవాలన్న చర్చకు కూడా కేసీఆర్, సింగ్ భేటీ ఆస్కారమైతే కల్పించింది.
రవీందర్ సింగ్ రాజకీయ జీవితాన్ని తీసుకుంటే… కేవలం కరీంనగర్ పట్టణ పరిధికి మాత్రమే పరిమితమైంది. మొదట బీజేపి నుంచి ప్రాతినిథ్యం వహించినా… ఆ తర్వాత కార్పోరేటర్ గా, మేయర్ గా కేసీఆర్ వెన్నంటి ఉద్యమంలోనూ కొనసాగారు సింగ్. ప్రస్తుతం కార్పొరేటర్ గా కొనసాగుతున్న సింగ్… కరీంనగర్ పట్టణంలో లో గుర్తింపు గల నాయకుడిగా, న్యాయవాదిగా కూడా కొంత ప్రత్యేకతను సంతరించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 230 కి పైగా ఓట్లకు పైగా సాధనలో.. రవీందర్ సింగ్ కు ఆ పట్టే అంతో ఇంతో ఉపయోగపడింది. అయితే ఇప్పటికే ఈటెల ఎపిసోడ్ ఒకవైపు… బీజేపి దూకుడు మరోవైపు… కాంగ్రెస్ లో రేవంత్ కు పగ్గాలిచ్చాక జరుగుతున్న పరిణామాలింకోవైపు… ఇలా పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులున్నాయని గ్రహించారో, ఏమోగానీ…. సీఎం కేసీఆరే ఒక్క స్టెప్ దిగి.. సింగ్ ను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ… ఇప్పటికైతే సింగ్ ను కింగ్ లా చేసేశాడు. ఈనేపథ్యంలో… సింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అవలంబించిన విధానాలు, జిమ్మిక్కులు, ట్రిక్కులు, అంతర్గతంగా ఆయనకు సహాయ, సహకారాలందించిన నాయకులెవ్వరు, పార్టీలోనే ఉంటూ కోవర్టు రాజకీయాలు చేస్తున్నదెవ్వరనే వివరాలతో పాటు.. బయటకొచ్చిన సింగ్ తో ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలెలా ఉండేవి… ఆర్థికంగా ఎవరెవరు తోడ్పాటునందించారు, ఎవరెవరు అవకాశవాద రాజకీయాలకు తెరతీస్తున్నారు… ఇలా పలు అంశాలను అదే సింగ్ నుంచి అడిగి తెలుసుకునేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ స్టెప్ తీసుకున్నాడన్నదీ ఓ ప్రచారంలో ఉన్న అంశం. ఈ క్రమంలో పార్టీలో ఉంటూనే సింగ్ ను నమ్మి ఆసరా అందించిన వారిలో చాలావరకూ గుబులు మొదలైనట్టుగా తెలుస్తుండగా… మరోవైపు నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకూ కేసీఆర్ ను దేవుడని… ఎమ్మెల్సీ ఎన్నికల సమయాన తిట్టిపోసి… ఇప్పుడు మళ్లీ భుజానికెత్తుకుంటున్న సింగ్ కు ఓ కార్పోరేషన్ పదవి కూడా కట్టబెట్టి కింగ్ చేస్తాడన్నది ఇప్పుడు వినిపిస్తున్న కొత్త ప్రచారం.
అసలెవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా సింగ్ ను దగ్గరకు తీసిన కేసీఆర్… ఇప్పటివరకూ మేం కేసీఆర్ కు దగ్గర అనుకునేవాళ్లనూ, ఎంతలో ఉంచాలో అంతే ఉంచే ప్లాన్ చేస్తున్నారా అనేది మరో కోణం. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి, ఎల్. రమణలకు క్యాబినెట్ హోదా దక్కనుందన్న ప్రచారంతో… ఈ కొత్త కోణాలు చర్చకొస్తున్నాయి.
రాష్ట్రంలో మిగతా జిల్లాల సంగతెలా ఉన్నా… కరీంనగర్ అంటే కొంత ప్రత్యేక దృష్టి సారించే కేసీఆర్… తనకెదురు తిరిగినందుకు హుజూరాబాద్ లో ఈటెలను ఎదుర్కొనేందుకు ఎలా సామ, దాన, భేద, దండోపాయాలన్నింటినీ వినియోగించారో… ఎన్నిక జరిగిన ఈ రాష్ట్రంతో పాటు… ఆ ఎన్నికపై మనసు పారేసుకున్న దేశంలోని రాజకీయ విశ్లేషకులందరికీ తెలిసిందే! ఏకంగా ఈటెలను ఎదుర్కొనే క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో జన్మించడమే అదృష్టమన్నట్టుగా… బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ కు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా బండ శ్రీనివాస్ కూ,హస్తానికి చేయిచ్చి కారెక్కినందుకు ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డికి ఎలాంటి అవకాశాలిచ్చి అందలమెక్కించారో అంతా చూస్తోందే!!
ఆధిపత్యానికి అడ్డు.?
మాజీ మంత్రైన ఈటెలను, ఎన్ని రకాల అడ్డుకోవాలని యత్నించినా… ఆయన గెలుపునాపలేకపోవడం కూడా ఒకింత కేసీఆర్ కు ఆందోళన రేకెత్తించడంతో పాటు… మరింత కసిని పెంచిన విషయమే అయిఉండాలి. అందుకే అక్కడ ఎమ్మెల్యేగా ఈటల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడం కోసమే… ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కి, క్యాబినెట్ హోదా పదవి కట్టబెట్టనున్నట్టుగా కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ గా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి… తాను నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటున్నాను మీ అనుమతి కావాలంటూ ప్రగతి భవన్ లో ఓ కీలక నాయకుడినడిగితే…” అట్ల ఏట్ల పోతావు? క్యాబినెట్ హోదా పదవితోనే కాన్స్టెన్సీ లో ( నియోజకవర్గంలో ) కాలు పెట్టాలి.. కనీసం నలభై నుంచి యాభై వేల మంది నీకు స్వాగతం పలికేలా ఏర్పాట్లు జరగాలి” అంటూ సదరు కీలక నాయకుడు కౌశిక్ తో అన్నట్టుగా కూడా ఓ టాక్ బయటకొచ్చింది. అలా ఒకవేళ కౌశిక్ రెడ్డీకి కూడా క్యాబినెట్ హోదా దక్కినట్టైతే… హుజురాబాద్ నుంచి బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్,ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తో పాటు… ముగ్గురు కలిసి నియోజకవర్గంలో పర్యటనలు, అధికారిక సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, చెక్కుల పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు పర్యవేక్షణా కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటూనే… మరోవైపు ఈటెలను డమ్మీని చేసే యత్నంగా కూడా ఈ పదవుల పందేరాన్ని విశ్లేషిస్తున్నారు.
మరి రమణకూ ఎమ్మెల్సీతో పాటు… క్యాబినెట్ హోదా ఎందుకు…?
రెండున్నర దశాబ్దాల కాలానికిపైగా ఆ పార్టీకి స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడికి నమ్మినబంటుగా ఉన్న రమణ… తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఆ పార్టీ శాఖ అధ్యక్షుడిగా కూడా కొనసాగిన సంగతి జన విదితమే! అయితే హుజురాబాద్ సంక్షోభ సమయంలో.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి… టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న రమణ.. తాను చేరితే తనకు ఫలానా పదవి కావాలని డిమాండ్స్ ను కేసీఆర్ ముందుకు తీసుకురాకపోవడమూ రమణపై కేసీఆర్ కు సదభిప్రాయానికి ఓ ప్రధాన కారణం. మరోవైపు తెలంగాణాలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల బలమెంతో జగమంతా తెలిసిన క్రమంలో… ఇప్పుడునన్న బీజేపి యువనాయకుల దూకుడును కాస్త మినహాయిస్తే… ఇక కాంగ్రెస్ నుంచి అక్కడో, ఇక్కడో.. ఓ రేవంత్ రెడ్డో, ఓ జీవన్ రెడ్డో, ఓ భట్టి విక్రమార్కో కనిపిస్తుండవచ్చు. మరి వారనెలా నిలువరించాలన్న థాట్ పోలీసింగ్ నుంచి పుట్టుకొచ్చినోడే ఎల్. రమణ. ఎందుకంటే తరచూ కేసీఆర్ ను టార్గెట్ చేసేవాళ్లల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీ కూడా ముందు వరుసలో ఉంటారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్ అనుకున్న స్థాయిలో జీవన్ రెడ్డీని ఎదుర్కొంటున్నాడా, లేదా అన్న మీమాంస ఓవైపు పార్టీలోనే ఉన్న క్రమంలో… జగిత్యాల వాసైన ఎల్. రమణనూ ఎమ్మెల్సీ చేయడంతో పాటు… ఓ క్యాబినెట్ హోదా అప్పజెప్పితే జీవన్ రెడ్డీకి చెక్ పెట్టడంతో పాటు… రేప్పొద్దున మళ్లీ తన కూతురు కవిత గనుక నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినా… ఓవైపు క్యాబినెట్ హోదాలో ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ ఉపయోగపడుతారన్న యోచనా బహుశా సీఎం కేసీఆర్ మైండ్ లో ఉండి ఉండొచ్చన్నది మరో చర్చ!
ఈ క్రమంలోనే సంక్రాంతి ఉత్తరాయణం తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉండకపోవచ్చునుగానీ… కౌశిక్ రెడ్డికీ, రమణకు క్యాబినెట్ హోదాలో పదవులతో పాటు… సింగ్ కు ఓ కార్పోరేషన్ పదవిచ్చి… ఎవరిని కలుపుకుంటే లాభం… ఎవరిని వదులుకుంటే లాభమనే ఎత్తుగడలతో సీఎం రాజకీయ చదరంగపు ఆట సాగుతోందనే చర్చకు ఇప్పుడు తెరలేచింది.
కేసీఆర్.. తిరిగి రవీందర్ సింగ్ ను రమ్మనడంలో ?