కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన -మంత్రి ఈశ్వర్

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన 67 మంది లబ్ధిదారులకు గురువారం స్థానిక క్యాంపు కార్యాలయం లో మంత్రి కొప్పుల ఈశ్వర్ కళ్యాణ లక్ష్మీ చెక్కులను మండలానికి చెందిన 67మంది లబ్ధిదారులకు ₹ 67,68,072 పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడపిల్లల తల్లికే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు, ఇస్తున్నాం అన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకుడదన్న ఉద్దేశ్యం తోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి పేదలకు అండగా నిలుస్తుందన్నారు. కాన్పు సమయంలో‌ అంగన్ వాడీల‌ ద్వారా పాలు, గుడ్లు, మంచి భోజనాన్ని గర్భిణీ స్త్రీలకు పోషకాహార రూపంలో అందజేస్తున్నామని ప్రసవ‌సమయంలో ప్రభుత్వాసుపత్రిలో జరిగితే పన్నెండు‌‌ వేల రూపాయలు, కేసీఆర్ ‌‌‌‌‌‌‌ కిట్స్ ఇస్తున్నామన్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన!!


ధర్మపురి కేంద్రంలో నిర్మాణం అవుతున్న 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్మాణాలను గురువారం మంత్రి ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యంపిపి చిట్టిబాబు మున్సిపల్ వైస్ ఛైర్మన్ రామన్న, స్థానిక తహసిల్దార్ వెంకటేష్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,AMC మాజీ ఛైర్మన్ అయ్యోరి రాజేష్, సంగి శేఖర్, సునీల్, శ్యామ్, సాంబమూర్తి మరియు అధికారులు పాల్గొన్నారు