అమెరికాలో మంత్రి కేటీఆర్ -బృందం పర్యటన !!

J.Surender Kumar,

తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ సెక్టార్‌ను మరింత బలోపేతం చేసేలా ఫైజర్, జె అండ్ జె, జీఎఎస్‌కే వంటి దిగ్గజ కంపెనీలతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సంస్థలు ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భాగం కాగా.. వీటి వార్షిక ఆదాయం 170 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ మూడు కంపెనీల్లో 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అటువంటి దిగ్గజ కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. హైదరాబాద్ ఫార్మా గ్రోత్ స్టోరీలో భాగం కావాలని కోరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ఇచ్చిన ప్రెజెంటేషన్‌ను కంపెనీల ప్రతినిధులు అభినందించారు. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్న తీరును స్వాగతించారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేలా భాగం కావాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించారు. 2023లో జరిగే బయో ఆసియా సదస్సులో పాల్గొనాలని కంపెనీల ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు.