నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి- కలెక్టర్ రవి

J.Surender Kumar

జగిత్యాల:- ఉద్యోగాల పోటీ పరీక్షలకు కోసం సిద్ధమయే నిరుద్యోగులు జిల్లాలోని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రవి కోరారు.

గురువారం జగిత్యాల, కొరుట్ల, మెటపల్లి లలోని గ్రంధాలయాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేసే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటుందని, నూతనంగా 80 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలో రానున్న నేపథ్యంలో ఉద్యోగార్థులూ గ్రంథాలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు

.నూతన గ్రంథాలయ నిర్మాణానికి స్థలం ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, ఉద్యోగ నోటిఫికేషన్ లో నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, లేదా ప్రభుత్వ డిగ్రీ కళాశాలు లేదా ఫంక్షన్ హాల్ లో విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా కనీస మౌలిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ అన్నారు.పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచుతామని త్రాగునీరు, స్టడీ చైర్లు, టాయిలెట్స్ వంటి కనీస మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు కల్పిస్తామని కలెక్టర్ వివరించారు

.పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం మరో ప్రాంతంలో 5 కంప్యూటర్లు అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ పేర్కొన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగ పరీక్షల్లో లో మంచి ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మాధవి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.