ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గురువారం జగిత్యాల రూరల్ మండలంలోని గుల్ల పేట గ్రామంలో లో ప్రాథమిక పాఠశాలను, సంగంపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సైతం విద్యార్థులకు మంచి మౌలిక వసతుల కల్పన దిశగా ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు.మొదటి దశలో మండల కేంద్రంగా అత్యధిక విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, మన జిల్లాలో 274 పాఠశాలలో మొదటి దశలో పనులు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో రూపొందించేందుకు అవసరమైన 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని పథకంలో పొందుపరచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తయారు చేసే సమయంలో న్యాయబద్ధంగా వ్యవహరించాలని, అనవసరమైన వృధా ఖర్చులు లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు.

గుల్లపేట గ్రామం లోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేసి మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనులను వివరించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా త్రాగు నీరు అందుబాటులో ఉండాలని , పాఠశాల లో టాయిలెట్ లో అందుబాటులో ఉన్నప్పటికీ , రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలోని విద్యార్థులతో పాఠ్య పుస్తకాలలోని పాఠాలను చదివించడం జరిగింది.పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ,విద్యార్థుల హాజరు వివరాలను కలెక్టర్ ఉపాధ్యాయుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు గైర్హాజరై విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.
గ్రామాల్లో ఉపాధి హామీ కింద చేపట్టే ప్రహరీ గోడ ,కిచెన్ షెడ్డు, టాయిలెట్ల నిర్మాణం తదితర పనులను ఉపాధిహామీ కింద పూర్తిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. సంగం పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 289 సంఖ్యలో విద్యార్థులు ఉన్నందున, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, టాయిలెట్ ఏర్పాటు చేయాలని, దానికి అవసరమైన భూమి అందుబాటులో లేదని, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు కొంతమంది దాతల నుండి నిధులు సేకరిస్తామని, ప్రభుత్వం సైతం కొంత నిధులు మంజూరు చేస్తే పక్కన ఉన్న 6 గుంటల భూమి కొనుగోలు చేయవచ్చని, దీన్ని పరిశీలించాలని గ్రామ సర్పంచ్ కోరారు.పాఠశాల సమీపంలో భూ కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, దాతల నుండి నిధులు సేకరించిన తర్వాత అవసరమైన నిధులను మంజూరు చేయించి కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు
ఈ పర్యటనలో జగిత్యాల ఆర్డీవో మాధురి, డీఈవో జగన్మోహన్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ ఈడి ఎస్సీ కార్పొరేషన్ లక్ష్మీనారాయణ, ఇంజనీరింగ్ అధికారులు ,తహసిల్దార్, గ్రామ సర్పంచు,ఇతర నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నరసింహుడి ని దర్శించుకుని జువ్వాడి!!

ధర్మపురి శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామీ వారి బ్రహ్మోత్సవాలు
భాగంగా స్వామి వారిని గురువారం. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ , జువ్వాడి నర్సింగ్ రావు . దర్శించుకున్నారు. అనంతరం నూతన ఆలయ కమిటీ సభ్యులు జువ్వాడి నర్సింగ్ రావు ను సన్మానించి స్వామి వారి డోలోత్సవం. మరియు రథోత్సవాలకు రావాలని ఆహ్వానిక పత్రికను అందజేశారు.. జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ ,మా నాన్న గారు .దివంగత నేత. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు మంత్రి గా వున్నపుడు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు అని, వారికి అనునిత్యం ఆలయ అభివృద్ధి మరియు ఈ ప్రాంత అభివృద్ధి గురించి వారి చివరి క్షణాల వరకు ఆలోచించారు అని అన్నారు. నూతనంగా ఎన్నికయిన ఆలయ కమిటీ సభ్యులు అందరూ ఆలయ అభివృద్ధి కి. మరియు భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. అలాగే నూతనంగా ఎన్నికైన ఆలయ. అభివృద్ధి కమిటీకి సభ్యులకు జువ్వాడి నర్సింగ్ రావు అభినదనలు తెలిపారు.