ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలి- మంత్రి కొప్పుల ఈశ్వర్!!

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల‌ని సంక్షేమ శాఖ, మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెరిగిన వంట‌ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి పట్టణంలో గురువారం చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొని దేశం లో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 సార్లు సిలిండర్ ధర పెంపు పై నిరసనగా కట్టెల పొయ్యి పైన వంటావార్పు చేశారు ,

అనంతరం వారానికి ఒకసారి పెట్రోల్ డీజిల్ ధర పెరగడంతో ఎడ్లబండి కి ఆటో లాగి నిరసన వ్యక్తం చేసిన మంత్రి కొప్పల ఈశ్వర్ ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… వంట గ్యాస్ వెయ్యి రూపాయలు చేశారు.. పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెంచేశారంటూ కేంద్ర ప్రభుత్వం తీరును త‌ప్పుప‌ట్టారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

పెట్రో ధరలు పెరగడంతో ఇతర నిత్యావసరాలు, కూరగాయల ధరలకు కూడా రెక్కలు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా ధరలను నియంత్రించాలని కోరారు.


చెక్కుల పంపిణీ
ధర్మపురి పట్టణ కేంద్రం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ధర్మపురి మండలం 33 మంది లబ్ధిదారుల కు 11, 89,500 రూపాయలు అలాగే బుగ్గారం మండలం 29 మంది లబ్ధిదారులకు 10,33,500 రూపాయల విలువగల చెక్కులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅనేకమంది పేద ప్రజలు డబ్బులు లేక ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద పేద ప్రజల ప్రాణాలను కాపాడుతున్నది అన్నారు. నియోజకవర్గంలో ఎంతో మంది పేద ,మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని మంత్రి అన్నారు.