పాలకులు మంచివారు అయితే -ప్రజలు సంతోషంగా ఉంటారు. మంత్రి ఈశ్వర్


-నాయకులు,పాలకులు మంచి వాళ్లయితే ప్రజల జీవితాలు బాగుపడతాయి,మంచి భవిష్యత్తు ఉంటుంది,సమాజం చల్లగా ఉంటుంది మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం హైదరాబాదులో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,నాయకులలో ఎవరు మంచో,ఏ ప్రభుత్వం మంచిదో,మన గురించి ఆలోచన చేసే వారెవరో,మంచి పాలన,పాలకుల గురించి ఆలోచన చేయాలి అన్నారు -ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం పేద వర్గాలకు మంచి చేయాలని,ఆలోచన చేస్తారు, ఆ దిశగా కార్యక్రమాలను రూపొందిస్తారు. ఇందులో భాగంగానే పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారు. వీటిలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన బాలబాలికలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందుతున్నది మంత్రి అన్నారు దుస్తులు,బూట్లు, పుస్తకాలు, పెన్నులు,పెన్సిల్స్,సబ్బులు, కాస్మోటిక్స్ తో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నమని విద్యార్థులు చక్కగా చదువుతున్నరు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నరు, మంచి ఫలితాలు సాధిస్తున్నరు, ఆత్మగౌరవంతో,ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగుతున్నరు అని మంత్రి వివరించారు


-విదేశాలలో ఉద్యోగాలు పొందే విధంగా నర్సులకు శిక్షణ ఇవ్వాలనే ఆలోచన చాలా గొప్పది మంత్రి కొనియాడారు.
ఇలాంటి కార్యక్రమం రాష్ట్రఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నో వినూత్న కార్యక్రమాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఈ శిక్షణా కార్యక్రమం కూడా అటువంటిదే, అన్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటిది. మొదటి బ్యాచ్ లో 135 మందికి మంచి శిక్షణ ఇవ్వడం , శిక్షణ పొందిన వారందరికి కూడా విదేశాలలో మంచి ఉద్యోగాలు రావాలని, జీవితంలో గొప్పగా స్థిరపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్న మంత్రి ఈశ్వర్ పేర్కొన్నారు .విదేశాలకు వెళ్లేందుకు ఆర్థిక చేయూతనిచ్చే విషయమై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు
కార్యక్రమానికి మంత్రి కొప్పుల ముఖ్య అతిథిగా హాజరు కాగా, కార్పోరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్,జనరల్ మేనేజర్ ఆనంద్, రంగారెడ్డి జిల్లా ఇ.డి.ప్రవీణ్, నర్సింగ్ కాలేజీల నిర్వాహకులు మల్లయ్య,సాంబిరెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు