రైతు సంక్షేమానికి ప్రాధాన్యం – మంత్రి ఈశ్వర్ !

దేశంలోనే రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
బుధవారం ధర్మపురిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ లో భాగంగా ₹ 300.43 లక్షల అంచనా వ్యయంతో అక్కపల్లి చెరువు పునరుద్ధరణ పనులను మంత్రి ప్రారంభించారు. ధర్మపురి రోడ్డు నెంబర్ NH63 నుంచి సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం , జూనియర్ కాలేజీ వరకు ₹ 104 లక్షల అంచన వ్యయం తో సి.సి రోడ్డు, విద్యుత్తు సబ్ స్టేషన్ నుండి హరిత హోటల్ ,స్మశానవాటిక వరకు ₹ 131 లక్షల అంచన వ్య‌యంతో సి.సి రోడ్లు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి ఆదర్శవంతంగా సంక్షేమ పాలన సీఎం కేసీఆర్ అందిస్తున్నారని అన్నారు. అక్కపల్లి చెరువు పునరుద్ధరణ పనులను పూర్తి అయితే రైతులపాలిట వరముగా మారుతుందని,ధర్మపురి పట్టణంలో పాటు నాగారం, కమలాపూర్, బుద్దేశ్ పల్లి, నర్సయ్య పల్లి, తాగు సాగు నీటి సమస్య తీరనుంది. అన్నారు. మొదటిదశ లో ఈ చెరవు లో పూడిక తీయడం వల్ల భూగర్భ జలాలు బాగా పెరుగుతాయని మంత్రి వివరించారు, ఆసరా పింఛన్లు ,కళ్యాణలక్ష్మీ షాదీ ముబారక్, రైతు బంధు ,రైతు బీమా, దళిత బంధు, కెసిఆర్ కిట్, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తెలిపారు.


మహిళలు చెరువుకు రెండు బతుకమ్మ ఘాట్ నిర్మించాలని కొరగా మంత్రి సానుకూలంగా స్పందించారు..
అభివృద్ధి కార్యక్రమాలలో,.సర్పంచ్ చిన్న నరసమ్మ, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, జెడ్పిటిసి సభ్యురాలు, మండల పరిషత్ అధ్యక్షుడు చిట్టిబాబు, DCMS ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మాజీ AMC ఛైర్మన్ అయ్యోరి రాజేష్ , కౌన్సిలర్ లు పాల్గొన్నారు.