కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తోడు దొంగలాట ఆపి ప్రజలపై మోపిన పన్నుల భారాన్ని తగ్గించాలని ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి డిమాండు చేశారు. శనివారం ఆయన జగిత్యాలలో సమావేశంలో మాట్లాడారు. 2014లో పెట్రోలుపై 14 శాతం పన్ను ఉంటే.. 35శాతం పెంచారని.. డిజిల్‌పై 12.50 శాతం ఉన్న పన్నును 27 శాతానికి పెంచారని.. 400 ఉన్న సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పెంచి ప్రజలపై పన్నుల భారాన్ని మోపీ తోడు దొంగళ్లా భాజపా, తెరాస ధర్నాలు చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్కుమార్, జగిత్యాల మునిసిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం లో పాల్గొన్నారు.

రాస్తారోకో…
మాల్యాల మండలానికి చెందిన 300 మంది భూ నిర్వాసితులు మల్యాల ఎక్స్ రోడ్ వద్ద రాస్తారోకో చేసి ఆందోళన చేశారు. కోదాడ నుండి జగిత్యాల వరకు NH 563 విస్తరణ సర్వేలో భాగంగా అధికారులు చేపడుతున్న భూసేకరణ సర్వే వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని. శనివారం వారు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు

రాజ్యాంగాన్ని అవహేళన చేశాడు!
భారత రాజ్యాంగాన్ని మార్చి దాని స్థానంలో నూతన రాజ్యాంగం రాసుకోవాలని మాట్లాడిన కేసీఆర్ రాజ్యాంగాన్ని అవహేళన చేసాడని కనుక ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హతను కోల్పోయడని MSF రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఓయూ నుండి చేపట్టిన బస్సు యాత్ర శనివారం ధర్మపురి కి చేరుకుంది. ఈ సందర్భంగా దికొండ మహేందర్ మాదిగ ఆధ్వర్యంలో స్వాగతం పలికి నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థి సదస్సులో గోవిందు నరేష్ మాట్లాడుతూ ” రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ద పరిపాలన అందిస్తామని ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన కేసీఆర్ అందుకు విరుద్ధంగా ఇప్పుడు రాజ్యాంగాన్నే మార్చాలని మాట్లాడం తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లుగా ఉందని అన్నారు. ఎన్ని పోరాటాలు జరిగిన కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ ఏర్పడింది అని మాట్లాడిన కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చలనడం రాజ్యాంగ ద్రోహమే అవుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చెడంలో పాలకుడిగా కేసీఆర్ వైఫల్యం చెందాడు అని ఆరోపించారు. ఆ వైఫల్యాలను, రాజ్యాంగం మీద మోపి పునీతుడనని అనిపించుకోవాలని ,దూరశతో చూస్తున్నడని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కారించడంలో రాజ్యాంగం ఎప్పుడు వైఫల్యం చెందలేదని, రాజ్యాంగం అమలు చేయలేని కేసీఆరే వైఫల్యం చెందాడని అన్నారు. ఈ సత్యాన్ని ప్రజలందరూ గుర్తించారని అన్నారు.కాబట్టి అధికారం కోల్పోతారనే నిస్పృహలలో ఉండి చిరకాలం తన కుటుంబ పాలన కొనసాగేలా చూడలనే కుట్ర బుద్ధితో రాజ్యాంగం మార్చాలని అంటున్నాడు. అందుకు రాచరిక పరిపాలన తేవడానికి నూతన రాజ్యాంగం కావాలని మాట్లాడుతూన్నాడని ఆరోపించారు. నియంతృత్వ రాచరిక పరిపాలన తేవడానికి కుట్ర పన్నుతున్న కేసీఆర్ ను ఎదుర్కొని రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. అందుకోసం ఏప్రిల్ 9 న హైదరాబాద్ లో జరిగే యుద్ధభేరి మహా ప్రదర్శనకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రథయాత్ర బృందం బెజ్జంకి అనిల్ మాదిగ, అరెల్లి మల్లేష్ మాదిగ, బాలు యాదవ్, మధు మాదిగ mrps జిల్లా ప్రధాన కార్యదర్శి అరికిల్ల సతీష్ మాదిగ ,జిల్లా నాయకులు జిల్లా పెల్లి రవి మాదిగ ,చెవులమద్ధి శ్రీనివాస్, రాష్ట్ర దళిత సంఘల నాయకులు పరపెల్లి రాజమల్లయ్య, బొల్లారాపు పోశెట్టి, పోశయ్య బిజెపి సీనియర్ నాయకులు రాయిల్లా రవి కుమార్, మండల రాములు, గంగాధర్,నరసయ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.