తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా 2020-21 సంవత్సరంనకు జగిత్యాల స్త్రీనిధి లోన్స్ మంజూరు,రిపేమెంట్ లక్ష్యాలను 100% పూర్తి చేసినందుకు మొదటి బహుమతి మరియు మంచిర్యాల మున్సిపాలిటీలో స్పెషల్ అచివ్ మెంట్ ఆన్ హైయెస్ట్ డిస్పెర్స్మెంట్ విత్ 100% ఆచివ్మెంట్ బహుమతిని స్త్రీ నిధి 9వ సర్వ సభ్య సమావేశము లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జగిత్యాల మున్సిపల్ కమిషనర్, జి స్వరూపరాణి కి రెండు అవార్డులను ప్రధానం చేశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ జి. స్వరూప రాణి కొనసాగుతున్నారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ, మున్సిపల్ & మెప్మా డైరెక్టర్ సత్యనారాయణ, స్త్రీ నిధి బ్యాంక్ యం.డి విద్యాసాగర్ రెడ్డి మరియు స్త్రీనిధి అధ్యక్ష కార్యదర్శులు ఇందిరా, సరస్వతి పాల్గొన్నారు.
