చలో అసెంబ్లీ ని అడ్డుకున్న ప్రభుత్వం!!

ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో రెడ్డి, వైశ్య, కార్పోరేషన్ల ఏర్పాటుపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం పట్ల రామారావు మండిపడ్డారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళుతున్న సామాజిక సంఘాల సమాఖ్య నాయకులను పోలీసులు బూర్గుల రామకృష్ణారావు భవన్ వద్ద అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ
తమ ఎన్నికల ప్రణాళికలో ఈ రెండు కార్పోరేషన్ల ఏర్పాటు విషయాన్ని టిఆర్ఎస్ స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా జమ్మికుంటలో నిర్వహించిన రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు,నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఈరెండు కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో వీటికి సంబంధించిన ప్రస్తావన లేకపోవడం పట్ల రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ హామీని అమలు చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటో స్పష్టం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పై ఉందన్నారు.
రెడ్డి, వైశ్య కులాల్లోని పేదల సంక్షేమం కోసం అవసరమైన నిధులు కేటాయిస్తూ చట్టబద్ధమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని,
ఇతర ఓసి కులాల పేదల సంక్షేమానికి ప్రతి ఏటా వెయ్యి కోట్ల నిధులు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఈ కార్పొరేషన్ల ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని,లేనిపక్షంలో తాము చేపట్టిన ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
వయసుతో నిమిత్తం లేకుండా రైతులందరికీ ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, 50 సంవత్సరాలు నిండిన రైతులకు ప్రతినెల ఐదువేల పించన్ చెల్లించాలని, వ్యవసాయాన్ని ఉపాధిహామీతో అనుసంధానం చేయాలని రామారావు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బడ్జెట్ సమావేశాల్లో 80 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.
గతంలో అనేక మార్లు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల వంతున భృతి చెల్లించాలని రామారావు ప్రభుత్వాన్ని కోరారు. ఓసి సామాజిక వర్గాలలోని పేదల విదేశీ విద్య కోసం ఇరవై ఐదు లక్షల సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఓసీలు, రైతులు, నిరుద్యోగులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొనే విధానాలను ప్రభుత్వం వదలి వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఓసి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్ రెడ్డి జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నమనేని పురుషోత్తమ రావు రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందుపట్ల నర్సింహారెడ్డి రాష్ట్ర ఆర్య వైశ్య సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్ రాష్ట్ర జిల్లాల నాయకులు జున్నూతుల రాజిరెడ్డి ఊట్కూరి రాధాకృష్ణ రెడ్డి జాపల్లి పృథ్వీదర్ రావు రాష్ట్ర సలహాదారు రావుల నర్సింహారెడ్డి హన్మంతరెడ్డి గోలి బక్కరేడ్డి గంగిడి ప్రభాకర్ రెడ్డి గౌతమ్ రెడ్డి విశ్వేశ్వర రావు తదితరుల తో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర నాయకులు పెద్ద సంఖ్య లో ఓసి సామాజిక సంఘాల రెడ్డి వైశ్య వెలమ సంఘాల వర్గీయులు హాజరయ్యారు