J.Surender Kumar.
కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)ను రాజస్థాన్,చత్తిస్ ఘడ్ ప్రభుత్వల రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు మరియు సీపీఎస్‌ను రద్దు చేస్తున్నట్టు రాజస్థాన్,చత్తిస్ ఘడ్ ప్రభుత్వం లు ప్రకటించడం హర్షణీయమని అలాగే మన తెలంగాణ రాష్ట్రం లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పాత పెన్షన్ పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటించి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షపాతి అని ఋజువు అయ్యేలా చెయ్యాలని జగిత్యాల లో నేడు జిల్లా ఉపాద్యాయ పరిశోధన మరియు శిక్షణ కేంద్రంలో TSCPSEU ఆధ్వర్యంలో నిరసన తెలిపారు
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు బోగ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 84 లక్షల రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 నుంచి సీపీఎస్ విధానాన్ని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని రాజస్థాన్,చత్తిస్ ఘడ్ ప్రభుత్వం బాటలో సత్వరమే పాత పింఛన్ విధానంపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కార్పొరేట్లకు దాసోహం అవుతూ ఉద్యోగుల జీత భత్యాల డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి ప్రోత్సహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు లకు,ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెల్హోట్ గారు అసెంబ్లీ లో
ప్రభుత్వ సర్వీసులతో అనుబంధం ఉన్న ఉద్యోగులు భవిష్యత్తు పట్ల సురక్షితమైన అనుభూతిని కలిగి ఉండాలని అప్పుడే వారు సేవా కాలంలో సుపరిపాలనకు తమ అమూల్యమైన సహకారాన్ని అందించగలరు ఉన్నారని ఆయన వివరించారు. జనవరి 1, 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులందరికీ ఏడాదిలోపు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తానని ప్రకటించిన విషయంను ఈ సందర్భంగా శ్రీనివాస్ వివరించారు.
ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక, సామాజిక భద్రత చేకూర్చాలంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని అలాంటి ప్రయత్నం చేస్తున్న రాష్ట్రలదారిలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వలు కూడా అమలు చేయాలన్నారు. మొండి వైఖరి విడనాలని రాష్ట్రంలోనూ సీపీఎస్ రద్దు దిశగా అడుగులు వేయాలని, దేశానికే మన ముఖ్యమంత్రి ఆదర్శంగా నిలిచి వెంటనే పాత పెన్షన్ ను పునరుద్ధరణ చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాయి శ్రీనివాస్, మంతెన కౌశిక్ కుమార్, కొండ్ర తిరుపతి, మడప శ్రీనివాస్, వినోద్,అశోక్, సంధ్యారాణి, రజిత, నవనీత,స్వాతి,మాధవి, తదితర ఉపాధ్యాయ వర్గాలు , పాల్గొన్నారు
