తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80,0039 (ఎనభై వేయిల ముప్పై తొమ్మిది ఉద్యోగాలు) భర్తీ చేస్తున్నట్లు ప్రకటన చెయ్యడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ పాత పెన్షన్ పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటన చెయ్యాలని కోరుతూ బుధవారం ధర్మపురి పట్టణ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల) లో జరుగుతున్న శిక్షణ కేంద్రంలో తెలంగాణ కంట్రిబ్యూటరీ, పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్, ఆధ్వర్యంలో కోర్సు డైరెక్టర్ రాజయ్య కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా TSCPSEU రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒక లక్ష డెభై రెండు వేల రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు 2004 నుంచి సీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయని ఆ విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు . రాజస్థాన్ ,ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వలు పాత పింఛన్ విధానంపై నిర్ణయం తీసుకొని CPS విధానం ను రద్దు చేశాయని వివరించారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక, సామాజిక భద్రత చేకూర్చాలంటే అన్ని రాష్ట్రాల్లోనూ పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూడా సీపీఎస్ రద్దు దిశగా అడుగులు వేసి దేశానికే ఆదర్శంగా నిలిచేలా వెంటనే పాత పెన్షన్ ను పునరుద్ధరణ చేసి సి పి ఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ బంధు గా నిలవని కోరారు. ఈ కార్యక్రమంలో TSCPSEU ధర్మపురి,బుగ్గారం మండల అధ్యక్షులు బండారి సతీశ్ ,సిర్ర శ్రీనివాస్ ,మామిడి సంతోష్, రాపర్తి రాజేష్, కాశెట్టి వెంకటరమణ, సాధు శ్రీకాంత్, సంద వెంకటేష్ , సందరికారి రాజేష్, దొంతుల శ్రీధర్, శీలం నర్సయ్య, బుగ్గారపు హరీష్ , ఒజ్జల మహేష్, తిరుపతి , విజయలక్ష్మి, సునీత, శ్రీలత, శ్రీత, సింధూజ , అనిత , భాగ్య లక్ష్మీ, అనూష స్వర్ణకుమారి,రోజా తదితరులు పాల్గొన్నారు
