పోలీస్.V/S ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్


ప్రారంభించిన అదనపు ఎస్పీ శ్రీ రూపేష్ ఐపీఎస్ గారు.*
జగిత్యాల్ :
జిల్లా పోలీస్ ,వర్సెస్ ప్రెస్ టీం ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ శనివారం జరిగింది. జిల్లా లోని స్థానిక గీత విద్యాలయం మైదానంలో జరిగిన. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా అదనపు ఎస్పీ రూపేష్ ఐపీఎస్ ప్రారంభించారు. మొదటగా అదనపు ఎస్పీ టాస్ వేయడం జరిగింది. టాస్ గెలిచిన జిల్లా పోలీసు జట్టు బ్యాటింగ్ చేపట్టారు. అదనపు ఎస్పీ బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు.

మొదట బ్యాటింగ్ చేసిన పోలీసు జట్టు నిర్ణీత 12 ఓవర్లకు 3 వికెట్స్ కోల్పోయి 126పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ప్రెస్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 6 వికెట్స్ ను కోల్పోయి 88 పరుగులు చేయడం తో పోలీస్ జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజేతలకు డీఎస్పీ లు ప్రకాష్ , రవీందర్ రెడ్డి , బహుమతులు అందించారు.

క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా పోలీస్ జట్టు నుండి రిజర్వ్ ఇన్స్పెక్టర్ వామన మూర్తి కి లభించడం జరిగింది. బెస్ట్ బ్యాట్స్ మెన్ గా ప్రెస్ టీం నుండి హైదర్ (45 RUNS), బెస్ట్ బౌలర్ గా పోలీస్ టీం నుంచి వెంకటేష్ (3 వికెట్స్), బెస్ట్ క్యాచ్ రూరల్ ఎస్. ఐ అనిల్ కు అందజేశారు
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, జర్నలిస్టుల సంఘము నాయకులు మాట్లాడుతూ… క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారు అని అన్నారు.

ప్రెస్, పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని. ప్రతి సంవత్సరం ఒక సారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ కండెక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపు తో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రకాష్, రవీందర్ రెడ్డి, సి.ఐ లు కిషోర్,కృష్ణకుమార్, కోటేశ్వర్, శ్రీను రమణ మూర్తి, RI లు నవీన్, వమనమూర్తి, ఎస్.ఐ లు, టియుడబ్ల్యూజె జిల్లా శాఖ అధ్యక్షుడు జె. సురేందర్ కుమార్, కార్యదర్శి బండ స్వామి, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శిలు చీటి శ్రీనివాసరావు, గూడ మల్లారెడ్డి, పాత్రికేయులు టివి సూర్యం, మహేష్ కుమార్, మల్లేశం, శంకర్ శర్మ, జహీర్, హైదర్, నరేష్, శ్రీనివాస్, శ్రీధర్ రావు, నాజీమ్, లక్ష్మణ్, గంగాధర్, మారుతి, సంపూర్ణ, దేవేందర్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.