J.Surender Kumar.
ప్రతి మండలంలో రెవెన్యూ సమస్యలను రెవెన్యూ అధికారులు ప్రజా సమస్యల నివారణ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ సర్వీసులు మరియు ఇతర అంశాలపై అధికారులతో జూమ్ వెబ్ కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ మరియు మీసేవా పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూఅధికారులు మాత్రమే పంపిణీ చేయాలని వేరే ఇతరులతో పంపిణీ చేయరాదని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి పిటీషన్ల పై సత్వరమే చర్యలు తీసుకొవాలని సూచించారు. ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని పేర్కోన్నారు.
పెండింగ్ మ్యూటేషన్లు, చెక్ మెమోలపై మీ సేవా సెంటర్ల ద్వారా మాత్రమే ధరఖాస్తులు చేసుకోవాలని, సిబ్బందికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనంలు , సర్వీసు మ్యాటర్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అన్నారు. చౌకధరణ దుకాణాల పై తరుచూ తనిఖీలు నిర్వహించి బియ్యం అక్రమ రవాణా జరుగకుండ చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక శ్రద్ధ వహించి రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఇంచార్జి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి మాదురి, 18మండలాల తహసీల్దార్లు , ఏ ఓ , కలెక్టరేట్, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.

దళిత బంధు యూనిట్లు గ్రౌండ్ చేయాలి !!
మొదటి విడత దళిత బందు యూనిట్లను త్వరితగతిన గ్రౌండ్ చేయాలని జిల్లా కలెక్టర్ జీ రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.దళిత బందు యూనిట్ల గ్రౌండింగ్ అంశం పై కలెక్టర్ సంబంధిత అధికారులతో ఉదయం జూమ్ కాన్ఫరెన్స్ సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రివ్యూ సమావేశం నిర్వహించారు. జిల్లాలో దళిత బంధు పథకం కింద మొదటి విడత లో 5 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 346 మంది లబ్ధిదారులను జిల్లా మంత్రి ఆమోదంతో ఎంపిక చేసినట్లు అధికారులు వివరించారు.జిల్లాలో ఏర్పాటు చేసిన దళిత బందు బృందాలు 344 లబ్ధిదారుల ధ్రువీకరణ, వారి నుంచి వివరాల సేకరణ పూర్తి చేశారని, మిగిలిన రెండు ఈ సాయంత్రం లోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా దళిత బంధు యూనిట్ల ఏర్పాటు పై అవగాహన సదస్సులు నిర్వహించామని, అనంతరం లబ్ధిదారులు యూనిట్ ఫైనల్ చేశారని కలెక్టర్ తెలిపారు.వ్యవసాయ వ్యవసాయాధారిత సెక్టార్లో 138 యూనిట్ల, రవాణా సెక్టార్ లో 82 యూనిట్ల, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ లో 29, రిటైల్ అండ్ షాప్స్ సెక్టార్ లో 57, సర్వీస్ సెక్టార్ లో 38 యూనిట్లను లబ్ధిదారుల ఎంపిక చేసుకోవడం జరిగిందని అధికారులు వివరించారు. ప్రభుత్వం జగిత్యాల జిల్లా కు రూ.16 కోట్ల నిధులు దళిత బంధు పథకం కింద విడుదల చేసిందని, రేపటి నుండి ప్రాధమికంగా, మార్చి 31లోగా పూర్తిస్థాయిలో యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.మండలాల వారీగా ప్రత్యేక అధికారులు సర్వీసెస్, రిటైలర్ షాప్స్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్,వ్యవసాయ అనుబంధ సెక్టార్ లబ్ధిదారులకు ఫోన్ చేసి యూనిట్ గ్రౌండ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్న వారిని గుర్తించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వ్యవసాయ సెక్టార్ , రవాణా సెంటర్ కింద ట్రాక్టర్లు, కార్లు , వివిధ రకాల వాహనాలు ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల వారి అర్హతలు, పూర్వ అనుభవాలు, డ్రైవింగ్ లైసెన్స్ ధృవీకరించాలని, వారికి అవసరమైన వాహన వివరాలు సేకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రిటైల్ షాప్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ట్రేడ్ లైసెన్స్ లను స్థానిక సంస్థల మునిసిపాలిటీ లేదా గ్రామపంచాయతీ సదరు లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ సూచించారు.