ధర్మపురి నరసింహుడి కి- ₹ 82 లక్షల ఆదాయం!!

J.Surender Kumar.

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కేవలం 13 రోజుల్లోనే 82 లక్షల 64 వేల, 570 రూపాయల ఆదాయం వచ్చింది. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం గా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 14 నుండి ప్రారంభం 26 ముగిశాయి. కేవలం 13 రోజుల్లో టిక్కెట్ల ద్వారా ₹.20,77,466,/- ప్రసాదాల అమ్మకం ద్వారా.₹ 23,88,170/-  అన్నదానం కోసం భక్తుల విరాళాల ద్వారా. ₹.7,16,476/-  హుండీ  ద్వారా ₹ 30,82,450/- ఆదాయం చేకూరింది. గత సంవత్సరం జాతర ఉత్సవాల కంటే 14 లక్షల రూపాయల ఆదాయం అధికంగా సమకూరిందని  ఈ ఓ  శ్రీనివాస్ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకు, అధికార యంత్రాంగానికి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ రాజకీయ పార్టీలకు, పాత్రికేయులకు స్థానిక మున్సిపల్ శాఖ కు కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్  కృతజ్ఞతలు తెలిపారు.


     శ్రీ‌వారి భక్తాగ్రగణ్యులైన శ్రీ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, శ్రీ నాథ‌ముని ఆచార్యులు, శ్రీ అనంతాచార్యులు,  ప‌ల్ల‌వ రాణి సామ‌వై త‌దిత‌రుల జీవిత చ‌రిత్ర‌ల‌ను భ‌క్త‌లోకానికి అందించేందుకు శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో స‌రి క్రొత్త శీర్షిక‌లు రూపొందించి ప్ర‌సారం చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి అతిథి భ‌వ‌నం స‌మావేశ మందిరంలో ఈవో ఎస్వీబిసి, కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. 
ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారు రచించిన వేలాది సంకీర్త‌న‌ల‌ల్లో ప్రాచుర్యంలో లేని సంకీర్తనలకు  జనబాహుళ్యంలో విస్తృతప్రచారం కల్పించాలనే సత్సంకల్పంతో యువతీ యువకులకు ఎస్వీబిసిలో ” అదివో… అల్లదివో.”… అన్నమయ్య పాటల పోటీలు, గ‌త ఏడాది డిసెంబ‌రులో ప్రారంభించిన‌ట్లు అన్నారు.. మొదట ఈ కార్యక్రమాన్ని 26 ఎపిసోడ్లు చేయాలని నిర్ణయించామ‌ని, కానీ భక్తుల నుండి లభిస్తున్న విశేష ఆదరణ దృష్ట్యా ఒక‌ సంవత్సరం, 53 వారాల పాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తరిగొండ వెంగమాంబ పాటలకు మ‌రింత విస్తృత‌ ప్రాచుర్యం కల్పించ నున్న‌ట్లు తెలిపారు.   అదేవిధంగా 1200 సంవ‌త్స‌రాల క్రితం శ్రీ‌వారి ఆల‌యానికి, భోగ శ్రీ‌నివాస మూర్తిని బ‌హూక‌రించిన ప‌ల్ల‌వ రాణి సామ‌వై, శ్రీ వైష్ణ‌వ ఆచార్యుల్లో అగ్రగ‌ణ్యుడు నారాయ‌ణ దివ్య ప్ర‌బంధంను, ర‌చించిన శ్రీ నాథ‌ముని ఆచార్యుల , జీవిత విశేషాల‌తో నూత‌న శీర్షిక‌లు రూపొందించి ప్ర‌సారం చేయ‌డానికి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్లు వివరించారు. ఇటీవల ప్రారంభించిన ఎస్వీబిసి క‌న్న‌డ ,ఛాన‌ల్‌లో దాస సాహిత్యంలోని పాట‌లను బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ” దాస న‌మ‌నం ” కార్య‌క్ర‌మాన్ని రూపొందిస్తున్న‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగా శ్రీ పురంద‌ర‌దాసుల సంకీర్త‌న‌ల‌ను త్వ‌ర‌లో ప్ర‌సారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఈవో చెప్పారు.     ఎస్వీబిసి చైర్మన్ శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర, ఎస్వీబిసి సీఈవో శ్రీ సురేష్ కుమార్  స‌మీక్ష స‌మావేశంలో పాల్గొన్నారు.
29న శ్రీవారి ఆల‌యంలో బ్రేక్ దర్శనాలు రద్దు !!
తిరుమల శ్రీవారి ఆలయంలో  మార్చి 29వ తేదీన మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు .ఈ నేపథ్యంలో మార్చి 28వ తేదీ సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవు. . ఈ విషయాన్ని భక్తులు గమనించి టిటిడికి  ఈవో సహకరించాలని  కార్యనిర్వాహణాధికారి ప్రకటనలో కోరారు.


శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న గవర్నర్ తమిళ సై !!


శ్రీశైల మల్లన్న దర్శనార్థం  విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్  గారికి ఆలయ మర్యాదలతో, రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం  పలికిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ,  దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్న, అర్చకస్వాములు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ కు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు

  అమ్మవారిని మల్లన్న స్వామిని దర్శించుకుని గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం ఆశీర్వచన మండపంలో  గవర్నర్  కు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించిన వేద పండితులు, అర్చకులు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను,  అమ్మవార్ల జ్ఞాపికను అందించి గవర్నర్ ను ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ , దేవస్థానం  ఈవో ,  జిల్లా ఎస్ పి, సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి,  కర్నూలు ఆర్ డిఓ హరి ప్రసాద్, ఆత్మకూరు డిఎస్పీ శృతి , తదితరులు పాల్గొన్నారు.