భక్తులకు సేవలు చేయాలి మంత్రి కొప్పుల ఈశ్వర్ !!

ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహా స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ధర్మకర్తల సన్మాన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ కమిటీ సభ్యులను సన్మానించి, 13 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు, పొరుగు రాష్ట్రాల నుండి రానున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండ కమిటీ సభ్యులు సేవలు అందించాలని మంత్రి నూతనంగా నియామకం కాబడిన ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంలో కమిటీ సభ్యులు 13 మంది ని మంత్రి సన్మానించారు. ఆలయాధికారులు, టిఆర్ఎస్ శ్రేణులు భక్తజనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు!!
సోషల్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక సారధి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ, కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని కేక్ కట్ చేసి టీఆర్ఎస్ శ్రేణులకు పంపిణీ చేశారు. ధర్మపురి మున్సిపల్ ,చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


విజేత ధర్మపురి జట్టు!!
ధర్మపురి పట్టణ కేంద్రంలో ధర్మపురి నియోజకవర్గ MLA రోలింగ్ కప్ క్రికెట్ పోటీల లో భాగంగా ఆదివారం జరిగిన పైనల్ లో ధర్మపురి, వెనుగుమట్ల గ్రామాల జట్ల మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ ను మంత్రి ఈశ్వర్ తిలకించారు, ధర్మపురి జట్టు విజయం సాధించింది. రెండు జట్ల కు క్రికెట్ ట్రోఫీ ని, గెలిచిన జట్టుకు ₹ 60,000 వేల ప్రైజ్, రన్నర్ జట్టు కు ₹ 30,000 వేల రూపాయల ప్రైజ్ మనీ నీ మంత్రి అందించి క్రీడాకారులను , నిర్వాహకులను, అభినందించారు.