ధర్మపురి దర్శన భాగ్యం – యోగి కి సీఎం యోగం!!

J.Surender kumar.

యూపీ సీఎం, యోగి ఆదిత్యనాథ్ రెండవ సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు. ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనభాగ్యం వల్ల, యోగికి సీఎం యోగం దక్కిందనే చర్చ క్షేత్రంలో నెలకొంది. గురువారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడడంతో పంజాబ్ మినహా ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, యూపీ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడం ఖాయంగా ఫలితాల సరళి తో తేటతెల్లం అవుతుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో క్రేజీ వాలా పార్టీ స్వీప్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది.
పారదర్శక పాలన పట్టం కట్టింది.!
యోగి ఆదిత్యనాథ్ 2017 మార్చి లో యుపి మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పారదర్శక పాలన ప్రజలకు చూపించారు. 2017 ఏప్రిల్ 4న తన మొదటి క్యాబినెట్ సమావేశంలో లక్షలాది మంది సన్నకారు ,చిన్నకారు రైతుల రుణమాఫీ చేస్తూ ఆమోదించారు. దాదాపు రూపాయలు 30 వేల 729 కోట్లు భారం ప్రభుత్వంపై పడింది. బడుగు ,బలహీన వర్గాల వారికి ,కూలినాలి చేసుకునే ప్రజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200కు పైగా ” అన్నపూర్ణ భోజనం” కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో టిఫిన్ ₹ 3, భోజనం ₹ 5. ధరల కు అందించారు. రాష్ట్రంలో గుండాయిజం,రౌడీయిజం, భూకబ్జాలు, ఫ్యాక్షన్ రాజకీయా నాయకుల, సంఘవిద్రోహ శక్తుల కు ఆయన సింహస్వప్నంగా మారారు. వందలాది మంది అవినీతి పోలీస్ అధికారులను నిర్ధాక్షణ్యంగా విధుల నుంచి తొలగించారు. హత్యలు, మహిళల పై అత్యాచారం చేసే రౌడీ మూకలను, ఎన్కౌంటర్లో హతమార్చరు. బెయిల్ పై ఉండడం కంటే జైలు జీవితమే తమకు రక్షణగా ఉంటుందని పలువురు తమ బెయిల్ను రద్దు చేసుకుని స్వచ్ఛందంగా జైల్లోనే గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. కొందరు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు. నెలకు రెండు సార్లు ఉచితంగా రేషన్ సరుకులను యోగి ప్రభుత్వం నిక్కచ్చిగా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. మతపరమైన విద్యా సంస్థలలో విద్యార్థులచే జాతీయగీతం ఆలపించి నిత్యం వీడియోలను సిఎం కార్యాలయానికి పంపాల్సిందిగా ఆర్డినెన్స్ జారీ చేయించి అమలుపరిచారు. జంతు వధ శాలలు మూసివేయించారు, అందులో పని చేస్తూ జీవనోపాధి పొందుతున్న లక్షలాదిమంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో సీఎం యోగి సఫలమయ్యారు. లవ్ జిహాదీ నిషేధం, జనాభా నియంత్రణ చట్టాన్ని తెచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారు పరిశ్రమ సాంసంగ్ ను నోయిడా రాష్ట్రంలో ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించారు. 50 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం 22 కిలోమీటర్ల పొడవుతో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు.
5 సార్లు ఎంపీగా!
యోగి ఆదిత్యనాథ్ మొట్టమొదటిసారి 12 వ లోక్ సభకు గోరక్ పూర్ పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికయ్యాడు ఆ సభలో అతి పిన్న వయసు గల ఎంపీగా రికార్డులో నమోదైంది. 1998, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఆయన గెలిచారు. లోక్ సభలో ఆయన హాజరు 77 శాతం .284 ప్రశ్నలు, 56 చర్చలలో, పాల్గొని 3 ప్రైవేట్ మెంబర్ బిల్లుల ను ఆయన ప్రవేశపెట్టారు. యోగి “హిందూ యువ వాహిని ” సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు. 2006 డిసెంబర్ 22-24 తేదీలలో గోరక్ పూర్ లో ” విరాట్ హిందూ మహా సమ్మేళనం” అతి పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికీ మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ, విశ్వహిందూ పరిషత్ చీఫ్ అశోక్ సింగల్ ,ఆర్ ఎస్ ఎస్ చీఫ్ ,రాజేంద్ర సింగ్ హాజరయ్యారు. లక్నో పట్టణంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్య భూమిక పోషించారు.
ధర్మపురి దర్శన భాగ్యం!!
గోరక్ పూర్ ఎంపీ గా కొనసాగుతున్న యోగి ఆదిత్యనాథ్ 2015 నవంబర్ మాసంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. గోదావరి నది హారతి వ్యవస్థాపక అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మురళీధర్ రావు ఆహ్వానం మేరకు యోగి ఆదిత్యనాథ్ నాడు ఎంపీ హోదాలో విచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మీ దర్శించుకొని గోదావరి నది హారతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ “మురళీధర్ జి నాకు ధర్మపురి నరసింహుడి దర్శనభాగ్యం, పవిత్ర గోదావరి నది హారతి ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కల్పించారు అంటూ తన ప్రసంగంలో కొనియాడారు . బిజెపి పార్టీ సమావేశాల్లో సీఎం హోదాలో యోగి ఆదిత్య నాథ్ ను అభినందించడానికి వెళ్లిన ధర్మపురి, తెలంగాణ కు చెందిన కొందరు బిజెపిపార్టీ నాయకులతో సీఎం, యోగి ఆదిత్యనాథ్ “ధర్మపురి భగవాన్ కే కృపసే సబ్ కుచ్ అచ్చా హాయ్” అంటూ గుర్తు చేసుకున్నట్టు. బిజెపి నాయకుడు రామ సుధాకర్ రావు, పలువురు నాయకులు ,అనేక సందర్భాలు వివరించడం ప్రస్తావనార్హం.