అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి డోలోత్సవం !!

ధర్మపురి క్షేత్రంలో ఆదివారం శ్రీ వెంకటేశ్వరస్వామి తెప్పోత్సవం ,డోలోత్సవం, అంగరంగ వైభవంగా బ్రహ్మ పుష్కరిణిలో జరిగింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు .వేద పండితులు వేద మంత్రాలతో మంత్రి సతీమణి సన్మానించి స్వామివారి శేష వస్త్రాలు బహుకరించారు.

మంగళ వాయిద్యాలు ,మేళతాళాలు, వేదమంత్రాల మధ్యన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవం మూర్తులను పుష్కరిణిలో ,హంస వాహనంపై ఉంచి నీటిలో ఐదు ప్రదక్షిణాలు గావించారు. గోవింద నామస్మరణతో పుష్కరిణి మారుమోగింది. భక్తజనం క్యూలైన్లో గంటల తరబడి నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సూపరిండెంట్ దేవల కిరణ్ నేతృత్వంలో కార్యక్రమం కొనసాగింది.

ఎలాంటి పోలీసు బలగాలు బందోబస్తు కానరాలేదు . ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది,ఆలయ సిబ్బంది ,స్వచ్ఛంద సేవకులు ,క్యూలైన్లలో పర్యవేక్షించి ఎలాంటి తొక్కిసలాట జరగకుండా చర్యలు చేపట్టారు పాలెపు చంద్రశేఖర శర్మ ప్రత్యేక వ్యాఖ్యానాలతో శ్రీ వేంకటేశ్వర స్వామి విశిష్టతను క్షేత్ర ప్రాశస్త్యము మైక్ ద్వారా వివరించారు. స్థానిక ఎస్ఆర్ఆర్ కేబుల్ నెట్వర్క్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తజనం చేరవేశారు.