ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల గౌడ సంఘం వారి ఆద్వర్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించు ఎల్లమ్మ బోనాల జాతర కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ జోగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అహల్య దంపతులు ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఈ కార్యక్రమం లోముంజల రఘువీర్ గౌడ్, నాయకులు జగిత్యాల కల్లు గీత పారిశ్రామిక సంఘం నాయకులు, సభ్యులు, సంఘ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు MLA విద్యాసాగర్రావ
తెలంగాణా ముఖ్యమంత్రి , పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణా రైతులపట్ల, మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వివక్షత కు వ్యతిరేకంగా జిల్లాలో పలు కార్యక్రమాలు చేయాలనీ తెరాస పార్టీ శ్రేణులకు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి..
*26 నాడు – అన్ని గ్రామ పంచాయతీల తీర్మానాలు*
*27 నాడు – అన్ని మండల పరిషత్ ల తీర్మానాలు*
*28 నాడు – అన్ని మార్కెట్ కమిటీలు,అన్ని PACS ల తీర్మానాలు*
*29 నాడు – డిసిసిబి, డీసీఎంఎస్ తీర్మానాలు*
*30 నాడు – జిల్లా పరిషత్ తీర్మానం*
*31 నాడు – మున్సిపాలిటీల తీర్మానాలు*
తీర్మానం చేసి వెనువెంటనే కొరియర్/ పోస్టుల ద్వారా ప్రధాన మంత్రి కి చేరేటట్టట్టు చేయాలని, తీర్మానం.. తీరు ఇలా ఉండాలని అని
” పంజాబ్ లో ప్రతీ సంవత్సరం రెండు పంటలు (వడ్లు,గోధుమలు)100% FCI ద్వారా కేంద్రమే కొంటున్నట్టు తెలంగాణ లో కూడా వానాకాలం వడ్లను, వేసంగి వడ్లను కేంద్రమే కొనాలి”
తీర్మానం పంపవలసిన చిరునామా…
Shri Narendra Modi
Hon’ble Prime Minister
Prime Minister’s office,South Block,New Delhi 110011
జిల్లాలొని టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, ఏఎంసి చైర్మన్లు, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, మునిసిపల్ చైర్మన్లు, ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుఆదేశం మేరకు పైన తెలిపిన ప్రకారం తీర్మానాలను ప్రధానమంత్రి నరేంద్రమోడి కి పంపవలసినదిగా ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రకటనలో పేర్కొన్నారు.