తెలంగాణలో అద్భుత పథకాలు అమలు చేస్తున్నాం -మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల ,:: దేశంలో ఎక్కడా లేని అద్భుత పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మిని పద్మనాయక కళ్యాణమండపం లో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గోన్నారు.


రైతు సంక్షేమం దిశగా దేశంలో ఎవరు అమలు చేయని పథకాలను సీఎం కేసిఆర్ అమలు చేస్తున్నారని, ప్రతి ఎకరానికి రూ.5వేల పంట పెట్టుబడి సాయం రెండు విడుతలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని , రైతు బంధు సాయం అందించేందుకు నిధులను సీఎం కేసిఆర్ సిద్దం చేసారని మంత్రి తెలిపారు.
రైతు భీమా పధకం కింద రైతు మరణించిన 10 రోజులో రూ.5 లక్షల సాయం అందిస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ కింద జిల్లాలోని 491 గ్రామాలకు గాను 473 గ్రామాలో స్థిరికరణ ధృవీకరణ పూర్తయిందని, పట్టణంలో సైతం పనులు చివరికి వచ్చాయని అధికారులు తెలిపారు.జిల్లాలో ఇంకా పెండింగులో ఉన్న పనులు అంచనాలను తయారు చేయుటకు ప్రత్యేక కమిటీను ఏర్పాటుచేయాలనిమంత్రి తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమశాఖ ద్వారా అనేక పథకాలు అమలు చేస్తుంది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.50వేల ఆర్థిక సహయం అందజేస్తుందని, దీని కోసం అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు జీవనోపాధి కై చర్యలుతీసుకుంటామని, జిల్లాలో దివ్యంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగిందనితెలిపారు.నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యను, త్రాగునీటి సమస్య ను, సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని తెలిపారు. భవిష్యత్తులో మన ప్రాంతంలో విద్యుత్ కోతలు, త్రాగు నీటి ఇబ్బందులు ,కరువు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టారని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ విద్యావ్యవస్థలో రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా మంచి ఫలితాలు సాధించారని, పూర్తిస్థాయిలో విద్యావ్యవస్థలో మార్పులు తీసుకు వచ్చే దిశగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సీఎం రూపొందించారని మంత్రి తెలిపారు.రూ.7500 కోట్ల వ్యయంతో 3 దశలో ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన 12 రకాల మౌలిక వసతుల కల్పించి ప్రైవేటుకు ధీటుగా తీర్చి దిద్దివిధానంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
మన ఊరు మన బడి మొదటి దశలో 35% పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, వీటిలో 65% విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని మంత్రి తెలిపారు.జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో 274 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లాలో పాఠశాలలు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించాలని మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అనంతరం పరిశ్రమల, పంచాయతీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యా, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖల పై సమావేశంలో చర్చించారు.


సమావేశంలో పాల్గొన్న జెడ్పీచైర్ పర్సన్ దావా వసంత మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు అదికారులు పరిష్కారం చూపి, వాటికి సంబంధించిన సమాచారం ప్రజాప్రతినిధులకు అందజేయాలని సూచించారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా వంటి సంక్షేమ పథకాలు, కాళేశ్వరం లాంటి భారీ ఎత్తిపోతల పథకం నిర్మాణం ద్వారా సాగు నీరు అందుబాటులోకి తెచ్చామని, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానంతో రైతులు పండించిన ధాన్యం కొనుగొలు చేయడం లేదని ఆమె విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులు పండించిన ధాన్యం కోనుగొలు చేయాలని జడ్పీ సర్వసభ్య సమావెశం ఏకగ్రీవ తీర్మానం జారీ చేసిందని ఆమె తెలిపారు. జిల్లాకు నూతనంగా మెడికల్ కళాశాలను మంజూరు చేసినందులకు సి.ఎం. కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
మండలాల్లో జరిగే అభివృది పనులలో ఎదురయ్యే సమస్యలపై పరిష్కార వేదికగా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత అన్నారు. జిల్లాలో చేపట్టే అభివృద్ది పనులలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషిచేయాలని, సమావేశంలో జిల్లాలో చేపడుతున్న అభివృద్ది పనులపై ఎదురయ్యే సమస్యలపై కులంకశంగా చర్చించుకుని వాటి పరిష్కారం దిశగా కృషిచేయాలని, సమావేశం ద్వారా చర్చకు వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చూడాలని,ప్రభుత్వ పథకాలన్ని ప్రజలకు చేరేలా అందరు బాద్యతగా వ్యవహరించి సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కోన్నారు.ఈ సమావేశంకు హాజరు కానీ ట్రాన్స్పోర్ట్ శాఖవారికి తాఖీదు జారీ చేయాలని ఆదేశించారు.


సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ జిల్లాలో దళిత బంధు పథకం కింద 346 మందిని గుర్తింపు చేసి 5 యూనిట్లు ( వ్యవసాయ, ట్రాస్పోర్ట్, ప్రొడక్షన్,రిటైల్, సర్వీసులు ) జిల్లా అధికారులుతో ప్రత్యేక టీంలు గా ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి లబ్ధిదారులకు వారి కుటుంబసభ్యులతో కలిపి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడంతో సుమారు 152 మంది వారు లాభదాయకంగా ఉన్న యూనిట్లు కు మార్పు చేసుకొని ఎంపిక చేయడం జరిగిందని తెలుపుతూ ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ప్రజా ప్రతినిధులు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.


ఎం.ఎల్.సి. ఎల్.రమణ మాట్లాడుతూ జిల్లాలోని రైతులుకు ఉన్న విద్యుత్సరఫరా కనెక్షన్లు, మోటారు సమస్యలు స్థానికంగా వెంటనే పరిష్కరించాలని తెలిపారు. వరి కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని కావున రైతులకు నష్టం కలుగకుండా వారిని ఆదుకునే విధంగా వారి పక్షాన పోరాటం చేయాలని పేర్కొన్నారు.


జగిత్యాల ఎమ్మెల్యే డా. యం. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, రైతులు నష్టపోకుండా వారి నుండి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విదంగా తీర్మానంప్రవేశపెట్టాలని, దళిత బంధు పథకం ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను వ్యాపారవేత్తలు గా తయారు చేయుటకు అవగాహన కార్యక్రమాలు చెప్పాట్టాలని తెలిపారు. జిల్లా అభివృద్దిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సాగాలని సూచించారు.
అనంతరం ఇటీవల మరణించిన మల్లు స్వరజ్జమ్మ కు నివాళులు అర్పించారు. నూతన ఎన్నికై మొదటి సారి గా సర్వ సభ్య సమావేశం కు హాజరైన ఎం.ఎల్.సి. రమణ ను సన్మానించారు.
సీజడ్పి వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, జెడ్పిటిసిలు, ఎం.పి.పి.లు, జెడ్పి సీ.ఈ.ఓ. సుందర వరద రాజన్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు, ఈ సమావేశంలో పాల్గొన్నారు.