హరితహారం 8 వ విడత కార్యక్రమం లో భాగంగా. 40 లక్షల 884 మొక్కలు నాటాలని కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. హరితహారం, పారిశుధ్యం, దళిత బందు, వంటి పలు అంశాల పై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 40.884 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి నిర్వహణ పై ప్రతి మండలం తమ పరిధిలో నర్సరీలు వారీగా ప్రణాళికతో, మ్యాచింగ్, బ్యాచింగ్, ప్రకారం మొక్కలు వచ్చే వారం లోగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకోవాలని ఆదేశించారు.

ఆయా నర్సరీలు, జరుగుతున్న ప్లాంటేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు మరింత చురుకైన పాత్ర ప్రదర్శించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా వారంలో మూడు సార్లు నీరు అందించాలని ఆదేశించారు.

ఈ విడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఇంచార్జి అదనపు కలెక్టర్,ఆర్.డి.ఓ. జగిత్యాల, డి.ఆర్.డి.ఓ., డి.ఎఫ్.ఓ. , మున్సిపల్ కమిషనర్లు, ఎం.పి.డి.ఓ.లు, తహసీల్దార్లు, ఎం.పి.ఓ.లు, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం !
మార్కెట్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తూ రైతాంగంను దగా చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాల అమ్మకాలను ఉక్కుపాదంతో అణిచి వేయాలని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి,. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు లు, శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల ఎస్పీలతో, పోలీస్ కమిషనర్ ల తో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు
.రాష్ట్రంలో ఎక్కువగా పత్తి, మిర్చి విత్తనాలు ఎక్కువగా కల్తీ గురవుతున్నామని వీటిపైనే ఎక్కువగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి శ్రమ వృధా కావడంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల పూర్తిగా రూపుమాపడం కోసం క్షేత్ర స్థాయి సిబ్బంది అంకితభావం, నిబద్ధతతో పని చేయడం ద్వారా నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా మార్చవచ్చని చెప్పారు.

రాబోయే 30 రోజుల పాటు నకిలీ విత్తనాలపై మరింత దృష్టి సారించి నకిలీ విత్తనాలు లేకుండా చూడాలని సూచించారు. గ్రామాల్లో కి వచ్చి నకిలీ విత్తనాలు అమ్మే వారి సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ముఖ్యంగా రైతులు విత్తనాలను లూస్ పద్ధతిలో కోనకుండా చూడాలని సూచించారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు సంబంధిత ఫర్టిలైజర్ షాప్ లో బిల్లు తీసుకునే విధంగా చూడాలని, అదేవిధంగా సంబంధిత ఫర్టిలైజర్ షాపుల్లో బిల్లు బుక్స్, రిజిస్టర్ ను క్రమంతప్పకుండా మెయింటెన్ చేసే విధంగా వ్యవసాయ అధికారులు చూడాలని సూచించారు. వ్యవసాయ మరియు పోలీస్ శాఖ అధికారులు వారివారి పరిధిలో ఉన్న ఫర్టిలైజర్స్ షాప్ ను క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

గత సంవత్సరం నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వారిపై 440 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కల్తీ విత్తనాల తో రైతులు మోసపోకుండా రాష్ట్రంలో పొలిసు, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయంతో పని చేస్తూ నకిలీ విత్తనాలు రాష్ట్రంగా చేయాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారు , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్ గారు, SB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,మరయు మండల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.