నరసింహ స్వామిని దర్శించుకున్న- అడిషనల్ కలెక్టర్

ధర్మపురి శ్రీలక్ష్మి నరసింహ స్వామినీ గురువారం
జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) తిరుకోవెల వినోద్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.. వీరికి ముందుగా దేవస్థానం అధికారులు అర్చకులు వేద పండితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సాంప్రదాయం ప్రకారం , స్వాగతించారు. పూజ అనంతరం అర్చకులు, ఆశీర్వచనం ఇవ్వగా, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, స్వామివారి శేషవస్త్ర, ప్రసాదం, చిత్రపటం అడిషనల్ కలెక్టర్ కు అందించారు.

ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు నంబి నరసింహ మూర్తి , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ , మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ , మున్సిపల్ కమిషనర్ రమేష్ , దేవస్థానం రెనవేషన్ కమిటీ సభ్యులు
అక్కనపల్లి సురేందర్, వేముల నరేష్, పాల్గొన్నారు.


మహాలక్ష్మి అమ్మవారి కి తలంబ్రాలు పట్టు వస్త్రాలు.!


ధర్మపురి గోదావరి నది వద్దగల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను, స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పక్షాన గురువారం అందజేశారు.. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవం ఉత్సవాల సందర్భంగా, ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరము కూడ ధర్మపురి దేవస్థానం పక్షాన దేవస్థానం అర్చకులకు అందించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , రెనవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామన్న , అక్కనపల్లి సురేందర్, వేముల నరేష్ . ,గునిశెట్టి రవీందర్ , వీరవేణి కొమురయ్య, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ , జూనియర్ అసిస్టెంట్ పురుషోత్తం రాజు సిబ్బంది పాల్గొన్నారు. .