. ప్రాణహిత నది పుష్కర స్నానాలతో భక్తజనం భక్తిభావంతో పులకరించి పోతున్నారు. నది తల్లికి పూజలు పితృదేవతలకు పిండ ప్రదానాలు దానధర్మాలు చేస్తూ, తమ భక్తి ప్రవత్తులు చాటుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా అర్జున్ గుట్ట ప్రాణహిత నది వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పుణ్యస్నానాలు ఆచరించి..ప్రత్యేక పూజలు చేసిన పుష్కరాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగవ రోజు భక్తజనం తాకిడి అధికమైంది. దానికి తగ్గట్టుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపడుతున్నారు
పూజా సామాగ్రి కొనుగోలు చేసిన భక్తులు

ప్రాణహిత నది పుష్కర ప్రాముఖ్యత.!
” ప్రణీతావరదావైన్యా గౌతమీచ సరస్వతీ
నద్యః పంచ వహంత్యత్ర ప్రయాగా త్కోటిశోధికం!!

ప్రాణహితానది, వైన్య, వరద, సరస్వతీ నదులు గోదావరిలో సంగమించే క్షేత్రంలో స్నానమాచరిస్తే… త్రివేణి సంగమ క్షేత్రమైన అలహాబాదు (ప్రయాగ)లో స్నానం చేసిన దానికంటే కోటిరెట్లు అధికమైన ఫలం లభిస్తుందని స్కంధపురాణంలోని కాళేశ్వర ఖండం చెబుతుంది. అంతటి ప్రత్యేకత గల క్షేత్రం పవిత్ర జీవనదీమతల్లిగా గుర్తింపు పొంది అధిక భాగం తెలుగు నేలలో ప్రవహిస్తున్న గోదావరి నదికి ప్రధాన ఉపనది ప్రాణహిత (ప్రణీత) నది. గోదావరి నదికి ఉపనదైనా ప్రాణహిత నది శ్రేష్ఠమైన 12 నదులలో ఒకటైనా ప్రాణహిత నదిలో వరదానది, పెన్ గంగ, చికిలి, పెద్దవాగు మొదలగు ఉపనదుల సమ్మేళితమై, ఆదిలాబాద్ జిల్లా ధర్మసాగరం వద్ద, మహారాష్ట్ర లోని ఆస్టి లకు సమీపంలో కలిసి ప్రాణహిత ఉద్బవిస్తుంది. నది ప్రశస్తం గురుంచి పద్మపురాణం, అగ్నిపురాణం, బ్రహ్మపురాణాంతర్గత కాళేశ్వర ఖండంలో మనకు కనిపిస్తాయి.

ఇంతటి విశిష్టత కలిగిన ప్రాణహిత పుష్కారాలు ఆద్యంతం శోభాయమానంగ కొనసాగేల పుష్కరాలను వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండ భక్తుల సౌకర్యార్థం పుణ్యస్నానాలతో పాటుగా పితృతర్పణం, పిండప్రదానం, శ్రాద్ద కర్మలు, నదులకు అర్ఘ్యప్రదానం, వాయినాలు, దానాలు వంటి పుణ్యకార్యక్రమాల కొరకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లతో పుష్కార స్నాలకు వచ్చే భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
