బాబు జగ్జీవన్ రామ్ సేవలు అభినందనీయం-కలెక్టర్

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కి అందించిన సేవలు అమోఘం అభినందనీయం అని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి అన్నారు. పట్టణంలోని మంచి నీళ్ల బావి వద్ద మంగళవారం ,షెడ్యూల్ కులాల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు

. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎస్ పి సింధు శర్మ, చైర్ పర్సన్ దావ వసంతం, మున్సిపల్ చైర్ పర్సన భోగ శ్రావణి, మున్సిపల్ కమిషనర్ షెడ్యూల్ కులాల అధికారి రాజ్ కుమార్, మరియు కౌన్సిలర్లు దళిత సంఘాలు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు