ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కొండగట్టు చిన్న హనుమాన్ జన్మదినం సందర్భంగా హనుమాన్ దీక్షా పరుల దీక్షా విరమణ చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో కొండగట్టు క్షేత్రం కిటకిటలాడింది. ఆలయంలో రద్దీ కొనసాగుతోంది, శుక్రవారం అర్థరాత్రి నుంచి మొదలైన రద్దీ ఉదయానికి కాస్త తగ్గింది.,

కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు., గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు లేకపోగా ఈ సారి ఉత్సవాలకు భక్తులు బారీగా తరలివచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకొని దీక్ష విరమణ చేశారు.
ధర్మపురి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం !

ప్రాణహిత పుష్కరాలు లో స్నానాలు చేయించి భక్తజనం ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి తరలిరావడంతో పాటలు హనుమాన్ భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించడానికి ఉదయం నుంచే తరలిరావడంతో శనివారం జ్వరం పుణ్యక్షేత్రం భక్తజనంతో పోటెత్తింది.

శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానమునకు అనుభంద దేవాలయమైన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానములో అలాగే శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానములోగల ఆంజనేయస్వామి వారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం , సుందరాకాండ పారాయణం లతో ప్రత్యేకపూజలు హరతి, మంత్రపుష్పం కార్యక్రమంలు నిర్వహించడం జరిగింది .

కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి, సంకటాల శ్రీనివాస్ ,వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ,ముత్యాల శర్మ , ప్రవీణ్ కుమార్, ఉపప్రదాన అర్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్య, స్థానిక వేదపండితులు మధు శంకర్ శర్మ , అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి , కళ్యాణ్ కుమార్ , నంబి అరుణ్ కుమార్, బొజ్జ రాజగోపాల్ , రెనవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య , అక్కనపల్లి సురేందర్,పల్లెర్ల సురేందర్ , వేముల నరేష్ ,గునిశెట్టి రవీందర్ ,వీరవేణి కొమురయ్య, ఇనగంటి రమ అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

జగిత్యాల రూరల్ మండల అంతర్గం గ్రామంలో, హనుమాన్ జయంతి నీ పురస్కరించుకొని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ ,లైబ్రరీ ఛైర్మెన్ డా చంద్రశేఖర్ గౌడ్ ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు,హనుమాన్ భక్తులు,తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ జన్మదినం పురస్కరించుకొని స్థానిక మంచినీళ్ళభావి వద్దగల శ్రీ గుండు అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్.,
కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ పంబాల రాము,పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,నాయకులు భూమన్న, బాలే శంకర్, గణేష్, శ్రీకాంత్, శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు.
కోరుట్ల పట్టణంలో !
హనుమాన్ జయంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయంలో కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తో కలిసి జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత ,ప్రత్యేక పూజలు చేశారు.
గండి హనుమాన్ దేవాలయం లో హనుమాన్ జయంతి ఉత్సవాలను కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రత్యేక పూజలు చేశారు.. రాముల వారి విగ్రహాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాన్ని. పరిశీలించారు.