మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం తన ఇంటిపై నల్లజెండాలతో నిరసనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. కేంద్రంలో బాధ్యతయుతమైన ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బిజెపి, తెలంగాణ విషయంలో బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో వానకాలం, యాసంగిలోను వరి మాత్రమే పండుతుందన్న విషయం తెలిసినా, యాసంగిలో వడ్లు కొనమని చెప్పడం అత్యంత దుర్మార్గమన్నారు.
తెలంగాణ ఉష్ణ వాతావరణమని ప్రపంచానికంతటికి తెలిసిందేనని, యాసంగి సమయంలో ఊష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటిపోతాయని, అంతటి వేడిలో వడ్లు పగులుతాయన్నారు. వడ్ల పగులకుండా ఉండేందుకే బాయిల్డ్ చేస్తారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసున్నారు. అన్ని తెలిసినా, కేంద్ర ప్రభుత్వం రా రైస్ తీసుకుంటామని,
బాయిల్డ్ రైస్ తీసుకోమని కొర్రీలు వేయడం కేంద్రానికి తగదన్నారు. తెలంగాణ ఉద్యమ వాడి వేడిని మరోసారి డిల్లీప్రభుత్వంకు చూపుతామని, తెలంగాణలో యాసంగి వడ్లను కొనేదాక పోరాటం చేస్తామన్నారు.


కానీ ఇప్పుడు చేతులెత్తేసి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటున్నారనీ అన్నారు. అసలు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు వరి ధాన్యాన్ని FCI ద్వారా కేంద్రమే కొంటుందని వారికి తెలుసునని, ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు చేయడం తప్ప బీజేపీ నాయకులు చేసిందేమీ లేదన్నారు. ఇప్పటికైనా ఎంపి బండి సంజయ్, కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి లు కేంద్ర ప్రభుత్వం తో వరి ధాన్యాన్ని కొనుగోలు చేపించాలని, రాష్ట్రం లో ఉన్న రైతన్నలను ఆదుకోవాలని ఈనెల 11న రైతు సెగలు ఢిల్లీకి వినిపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సారంగాపూర్ ,బీర్పూర్ మండల నాయకులు,రైతులు,రైతు బందు నాయకులు,టీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.