J.Surender Kumar,
” ఏ ఉద్యోగం దొరకకపోతే ఊరిలో హోటల్ పెట్టుకొని బ్రతుకుతా, అని గ్రామీణ యువకులలో ఉన్న ఆత్మస్థైర్యంకు ఆ వ్యాపారం కు ఆర్థిక పరమైన అంశం అడ్డుగా నిలుస్తున్నది కాబోలు. కార్పొరేట్ చాయ్ హోటల్లు, సెంటర్లు వ్యాపారం గ్రామాలకు విస్తరించడంతో గ్రామాల్లోని చాయ్ హోటల్స్ పై చావు దెబ్బ పడింది ”

గత దశాబ్దంన్నర కాలం క్రితం వరకు హైదరాబాదు, జిల్లా కేంద్రాల్లో,. ప్రధాన పట్టణాల్లో ఇరానీ చాయ్ తాగాము,. గ్రాండ్ హోటల్ , ఆల్ఫా హోటల్, ఇరానీ హోటల్, పేర్లు చెప్పుకుంటూ అక్కడి ఛాయ, బిస్కెట్ల, గురించి స్నేహితులు , వారి వారి మాటల్లో మాట్లాడుకోవడం , ముచ్చట్లు పెట్టుకోవడం అందరికీ తెలిసిన విషయమే. ధర్మపురిలో కరీం చాయ్, బషీర్ చాయ్, బొల్లం సత్తయ్య, చాయ్ హోటల్లు కు ఎనలేని గుర్తింపు. జగిత్యాల లో ‘ రషీద్ అపూట్ చాయ్’ లడ్డు కాజా , కోరుట్ల లో బస్టాండ్ దగ్గర మల్లేశం చాయ్. లకు విపరీతమైన క్రేజీ ఉండేది. అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల చాయ్ హోటల్స్ ఉన్నప్పటికీ 1,2 హోటల్స్ కు ప్రత్యేకత ఉండేది. సింగిల్ చాయ్, వన్ బై టు చాయ్, స్ట్రాంగ్ చాయ్, అపుట్ చాయ్ లు ఆర్డర్ ఇచ్చేవారు.

1967-70 లో సింగిల్ ఛాయ్ o-15 పైసల నుంచి 2010 -12 వరకు ధర 3 రూపాయలు దాటలేదు. ప్రస్తుతం గ్రామాల్లో ఆ ట్రెండ్ మారింది. కడక్ హౌస్, దొస్తే కేఫ, టీ పాయింట్,. చాయ్ పాయింట్, టీ ట్రంక్, చాయోమ్, డోస్ టీ..కేఫ్, అమృతతుల్య, ఆరోగ్య అమృతతుల్య, టీ స్టాల్స్ వెలిసాయి. బ్లాక్ టీ ,చాక్లెట్ టీ, బెల్లం టీ, లెమన్ టీ, తులసి టీ, గ్రీన్ టీ, లాంటివి మార్కెట్లో. చలామణి అవుతున్నాయి

5 లక్షలు పెట్టుబడి.. చరణ్ !
తాను హోటల్ మేనేజ్మెంట్ చేశానని, మారుతున్న మార్కెట్ సరళి ,సమాజ జీవన విధానం ,అభిరుచులకు అనుగుణంగా వ్యాపారం చేయాల్సిందేనని అమృతతుల్య టి స్టాల్ యజమానీ రెంటం చరణ్ తెలిపారు. పూణే కేంద్రంగా ఈ సంస్థ ఉందని ఆ సంస్థకు ₹ ఐదు లక్షలు చెల్లిస్తే, టీ స్టాల్ కు, సంబంధించిన పరికరాలు ఇవ్వడంతోపాటు, వారం రోజుల పాటు టీ తయారీలో మెళకువలు నేర్పుతారని చెప్పాడు. రా మెటీరియల్ కోసం ప్రతి నెల అవసరం మేరకు డబ్బులు ఆన్లైన్లో చెల్లిస్తే వారు కొరియర్ ద్వారా సప్లై చేస్తారని మన మార్కెటింగ్ ను బట్టి రా మెటీరియల్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. బెల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, తులసి టీ ,గ్రీన్ టీ , గ్రీన్ టీ, సాధారణ టీలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. రాయపట్నం, వెల్గటూర్, ధర్మారం తదితర మండల కేంద్రాల్లో కూడా ఈ వ్యాపారం వ్యాపించింది.

చాయ్, ప్రత్యేకత ఏమిటి ?
చాయ్ గురించి ఎంత చర్చించుకున్న తక్కువే, 2014 సంవత్సరం నుంచి చాయ్ కు ఎనలేని ప్రపంచస్థాయి రాజకీయ ప్రాచుర్యం లభించిందని చెప్పుకోవాల్సింది. ‘ నాటి చాయ్ వాల్ నేటి భారత ప్రధాని ‘ అనే విశ్వవిఖ్యాత గుర్తింపు తెలిసిందే. ఈ చాయ్ మానవ జీవన విధానంలో తాగునీరు లా , నిత్య అవసరంగా మారిందని. తలనొప్పి , ఏ పని లేక బోర్ కొట్టిన , పని ఒత్తిడి తగ్గించుకోవడానికి తప్పనిసరి టానిక్ గా మారింది. మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం లో కూడా కనీసం చాయ్ కూడా పోయలేదు, ఆఫర్ చేయలేదనె చర్చలు అప్పుడప్పుడు కొనసాగడం షరా మామూలే.

కార్పొరేట్ చాయ్ పుట్టుక !

ఉత్తరాదికి చెందిన అములిక్ సింగ్ బిజ్రల్ , కార్పోరేట్ చాయ్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ముంబై, చెన్నై, ఢిల్లీ, పూణే ,హైదరాబాద్ , గురుగ్రామ్ పట్టణాల్లో చాయ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇంటింటికి చాయ్ డెలివరీ చేసే మొదటి సంస్థ ఇదే. పది సంవత్సరాల్లో దాదాపు 150 స్టోర్స్ ఏర్పాటు చేసింది. 2015 లో హైదరాబాదులో రషీద్, మోహినుద్దీన్, సమియర్ కలిసి వివిధ రకాల రుచులను హైదరాబాద్ వాసులకు పరిచయం చేశారు. ‘ కడక్ హౌస్’ అని దీనికి పేరు పెట్టారు. 2012 లో సిలిగుడికి చెందిన కుషాల్ , ‘టి బాక్స్’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టి దాదాపు వంద దేశాలకు చాయ్ పొడిని ఎగుమతి చేస్తున్నారు.
