చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం జడ్జి ప్రమీల జైన్ !

ధర్మపురి కోర్టు ఆవరణలో, కాక్షిదారుల దాహార్తిని తీర్చేందుకు బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. శుక్రవారం జూనియర్ సివిల్ జడ్జి, శ్రీమతి ప్రమీల జైన్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బి .రాజేష్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, తిరమందాసు సత్యనారాయణ, తో కలసి ఆమె ప్రారంభించారు, ఈ సందర్భంగా జడ్జి శ్రీమతి ప్రమీల జైన్ మాట్లాడుతూ న్యాయవాదులు వేసవిలో కోర్టు ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె సభ్యులను అభినందించారు.

కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గడ్డం లింగారెడ్డి, రౌతు రాజేష్, రామడుగు రాజేష్, గూడ జితేందర్ రెడ్డి, సాంబరాజుల కార్తీక్, జాజాల రమేష్, కరవత్తుల భావన, బత్తిని ఇంద్రకరణ్, కోర్టు సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు.


పరామర్శ!


మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, TRS నాయకుల వేధింపులు, అరాచకాలకు, ఖమ్మం లో ఆత్మహత్య చేసుకున్న బిజెపి యువ నాయకుడు సాయి గణేష్ కుటుంబాన్ని శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మాజీ ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి , తదితర రాష్ట్ర నాయకులు పరామర్శించి కుటుంబాన్ని ఓదార్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని, ఆత్మ హత్యకు కారకులైన వారిని, కఠినంగా శిక్షించే వరకు పార్టీ పోరాడుతుంది అని వారికి పలువురు బీజేపీ నేతలు తమ ప్రసంగాల్లో ధైర్యం చెప్పారు.


కాలేశ్వరం లో భక్తుల సందడి!


ప్రాణహిత పుష్కర స్నానం కోసం సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తజనంతో శుక్రవారం కాళేశ్వర ఈ క్షేత్రంలో సందడి నెలకొంది.
నది స్నానాలు మొదలుకొని, దేవాలయంలో దర్శనం వరకు, ఎక్కడాకూడ భక్తులకు, ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిచోట అధికారులు, పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఘాట్ వద్ద స్నానాల కొరకు షవర్ లు, నల్లాలను, ఏర్పాటు చేయడంతో పాటు , నదిలో లోతట్టు ప్రాంతాలకు, ఎవరు వెళ్లకుండా షిప్టుల, వారిగా రెస్యూటీంలు, పహరా కాస్తు, భక్తులను అప్రమత్తం చేస్తున్నారు.

ఎక్కడాకూడా చెత్తచెదారం లేకుండా, సానిటేషన్ సిబ్బందితో ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నారు.


వరంగల్ లో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది !


వరంగల్ జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది.హనుమకొండ గాంధీనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలు గొంతుకోసి పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.
నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన అనూష, కేయులో ఎంసిఏ, ఫైనలియర్ చదువుతూ, హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. శుక్రవారం ఎంసిఏ ఎగ్జామ్ ఉండడంతో గాంధీనగర్‌లో కుంటుంబ సభ్యుల వద్దకు వచ్చింది. అనూష వచ్చిన విషయం తెలుసుకున్న అజార్‌ ఆమెను వెంబడించి చున్నీతో చేతులు కట్టేసి గొంతుకోసి పరార్ అయినట్టు స్థానికులు చెప్తున్నారు., తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గొంతు వద్ద ఇంచు వరకు తెగడంతో అనూష మాట్లాడలేకపోతోందని అన్నారు. ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు., పోలీసులు ప్రేమోన్మాది గురించి ఆరా తీస్తున్నారు. గొంతు కోసిన ప్రేమోన్మాది, అజార్‌ది సంగెం మండలం ముడ్రాయి, గ్రామమని చర్చ. ప్రేమను నిరాకరించడంతోనే, కత్తితో గొంతు కోసి పారిపోయినట్లు అనూష కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.


గవర్నర్ ఆరా !


ఈ దారుణ సంఘటనపై గవర్నర్ తమిళ సై స్పందించారు యువతి మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పూర్తి నీకు అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు.