భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎంవో అధికారులు, పీఆర్వోలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్..
ముఖ్యమంత్రి కేసీఆర్ మహనీయులు అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తూ అన్ని వర్గాల సంక్షేమం, సముద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నరు. అని అన్నారు. అభివృద్ధి,సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తున్నది, దిక్సూచిగా మారింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న వారి విగ్రహానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్రల గురించి వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన పలువురు బాలబాలికలకు నగదు బహుమతులు అందజేసి, అభినందించారు,
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ ఫోటో గ్యాలరీని మంత్రి కొప్పుల సందర్శించి, దాని నిర్వాహాకులైన ఎస్సీ ఉద్యోగులను అభినందించారు

ధర్మపురి కోర్టులో…
మండల కేంద్రంలోని కోర్ట్ ఆవరణలో నవ యుగ భారత నిర్మాత, భారత రాజ్యాంగ పితామహుడు డా” బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సీనియర్ న్యాయవాది ధర్మపురి న్యాయవాదుల సంఘ అధ్యక్షులు తిరమందాసు సత్యనారాయణ గారు మరియు న్యాయవాదులు సాంబరాజుల కార్తీక్,జాజాల రమేష్,బత్తిని ఇంద్రకరణ్, కరువత్తుల భావన లు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు,

చెక్కుల పంపిణీ..
SC కార్పొరేషన్ ద్వారా మంజూరైన 4 లక్షల రూపాయల చెక్కులను 8 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి 50వేల చొప్పున అందజేసిన ఎమ్మల్యే డా. సంజయ్ కుమార్ గారు, జడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ గారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ గారు ,అల్లీపూర్ ఎంపీటీసీ మోర విజయ లక్ష్మి వెంకటేష్ రాయికల్ మండల కో ఆప్షన్ మెంబెర్ MA. మొకీద్ TRS నాయకులు పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో..
డా. బి.ఆర్. అంబేడ్కర్ 131 వ జయంతి సందర్భంగా జిల్లా బిజేపి అద్యక్షుడు మోరపల్లి సత్యనారయణ రావు ఆధ్వర్యంలో అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా,మండల బిజేపి నాయకులు, కార్యకర్త లు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సంఘాలు..
డా. బి.ఆర్. అంబేడ్కర్ 131 వ జయంతి సందర్భంగా PRTUTS ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, బోయినపల్లి ఆనందరావు ఆధ్వర్యంలో అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు., ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో..
తెలంగాణ ప్రభుత్వం అద్వర్యం లో జిల్లా కేంద్రంలో ని తహసిల్ చౌరస్తాలో భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్.అంబెడ్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పి ఛైర్పర్సన్ దావా వసంత సురేష్, జిల్లా కలెక్టర్ జి.రవి, జిల్లా ఎస్పీ సింధు శర్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ లు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవో మాధురి, అంబెడ్కర్ సంఘ నాయకులు, జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు అని ఆయన ముందుచూపుతో రచించిన రాజ్యాంగం వలనే నేడు మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ లోఅంబేద్కర్ 131 వ జయంతి కార్యక్రమంలో పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు

. ధర్మపురిలో..
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్
అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
