-జగిత్యాల జిల్లా ధర్మపురికి ప్రభుత్వం డయాలిసిస్ కేంద్రాన్ని మంజూరు చేసింది. -ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతిపాదన మేరకు ఈ సెంటర్ మంజూరైంది. -ఇది ధర్మపురి పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో 5 మెషీన్లతో త్వరలో ఏర్పాటు కానున్నది -ఈ మేరకు ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. -మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న,గురయ్యే వారికి ఈ కేంద్రం ద్వారా మెరుగైన ఉచిత వైద్య సేవలందుతాయి. -గతంలో మూత్రపిండాల వ్యాధికి గురైతే వైద్య సహాయం కోసం హైదరాబాద్,వరంగల్ వంటి నగరాలలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరే వాళ్లు -ఇది తీవ్ర వ్యయ ప్రయాసలతో కూడినది కావడం, వ్యాధి తీవ్రతను సకాలంలో గుర్తించకపోవడం, అవసరమైన వైద్యసేవలు అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయే వాళ్లు. -ఇదంతా గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాలలో కూడా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం తెలిసిందే. -ఇందులో భాగంగా 515 మెషీన్లతో 61 కేంద్రాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -ఇవి దశలవారీగా ఏర్పాటవుతాయి, వైద్యారోగ్య శాఖ తాజా ఉత్తర్వుల్లో 5 కేంద్రాలు మంజూరు కాగా,అందులో ధర్మపురి ఒకటి. -మిగతా 4, సిద్ధిపేట జిల్లా దుబ్బాక, హుస్నాబాద్, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, నాగార్జున సాగర్ లకు మంజూరయ్యాయి.