పేద ప్రజల పాలిట ముఖ్యమంత్రి సహాయనిధి ఓ వరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఆయన ధర్మపురి, బుగ్గారం మండలాలకు మంజూరు అయిన 65 లబ్ధిదారులకు 25,22,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ ఎంతో మంది పేద ,మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు!
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇ కొప్పుల ఈశ్వర్ కు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్, తెలిపి శాలువాతో సన్మానించారు.

ప్రభుత్వ ఆస్పత్రి భూమి కబ్జా. విచారించండి !
రాయికల్ పొట్టను మున్సిపాలిటీగా మండల కేంద్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వాసుపత్రి భూమి కబ్జాకు గురైందని ఆరోపణలతో విచారణ జరిపించాలని మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. 1964 కు పూర్వం రాయికల్ గ్రామస్తులు భూమి సేకరిచటం జరిగిందని,.పూర్వం సేకరించిన భూమి కబ్జా కు గురి కావడం పట్ల విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి వినతి పత్రంలో పేర్కొన్నారు.

శ్రీధర్ కు. సన్మానం !!
ధర్మపురి పట్టణంలో స్మశాన వాటిక నిర్మాణానికి భూమిని దానం చేసిన గుడ్ల శ్రీధర్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ సన్మానించి అభినందించారు. మంగళవారం స్మశాన వాటిక ను మంత్రి కలెక్టర్ జెడ్పి చైర్ పర్సన్ మున్సిపల్ చైర్ పర్సన్ తదితరులు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.