దళిత బంధు పురోగతిపై సమీక్ష !

దళిత బంధు పథకం అమలు పురోగతి పై మంగళవారం  జిల్లా కలెక్టర్ . గూగుల్ లోతు రవి  తన కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి అధికార యంత్రాంగం అప్రమత్తం చేసి పురోగతి నివేదికలను కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎం.పి.డి.ఓ.లు  తదితర అధికార గణం పాల్గొన్నారు

24 న తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు!

వివరాలు వెల్లడించిన జిల్లా విద్యాశాఖ అధికారి !


2022-23 విద్యా సంవత్సరానికి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ 6వ తరగతిలో ప్రవేశానికి మరియు 7 నుండి 10 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం జగిత్యాల జిల్లలో 21 కేంద్రాలలో ప్రవేశ పరీక్ష   తేది. 24-04-2022 న నిర్వహించబడును.  6వ తరగతిలో ప్రవేశ పరీక్ష ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు  7 నుండి 10 తరగతులకు మధ్యాహ్నం 2.00 నుండి  4.00 వరకు నిర్వహించబడును.
విద్యార్థులు తమ హాల్ టికెట్లు telanganams.cgg.gov.in వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

    లబ్ధిదారుల ఇళ్ల వద్దకే. చెక్కులు !
నూతన విధానం కు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే !


జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నూతన విధానం కు శ్రీకారం చుట్టారు.  మంగళవారం పట్టణంలో సీఎం సహాయనిధి, కళ్యాణ లక్ష్మి, లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందజేశారు వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణానికి చెందిన 8, 6, 4, 3,19,21,36,37, 40 వార్డులకు చెందిన, 22 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా ,మంజూరైన ,8లక్షల రూపాయల విలువగల చెక్కులను, 18మంది  ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా, మంజూరైన 18 లక్షల 2వేల రూపాయల విలువగల చెక్కులను  లబ్దిదారుల ఇంటింటికీ  వెళ్లి స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్  అందజేశారు. ,అభివృద్ధి పనులను పరిశీలిస్తూ, సమస్యలను వింటూ పరిష్కరిస్తూ ,పారిశుధ్యం పై అవగాహన కల్పించారు  .ఈ కార్యక్రమంలో పట్టణ టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.  మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,.స్థానిక కౌన్సిలర్ లు వానరాసి మల్లావ్వ తిరుమలయ్యా,  కొలగని ప్రేమలత సత్యం, క్యదాసు నవీన్,  మూస్కు నారాయణ రెడ్డి,అల్లే గంగ సాగర్ ,,ఆడువాల జ్యోతి లక్ష్మణ్,.అవారి శివకేసరిబాబు, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, యూత్ అధ్యక్షులు కట్రోజ్ గిరి,.పట్టణ  రైతు విభాగం అధ్యక్షులు బండారి నరేందర్, సోషల్ మీడియా అధ్యక్షుడు అలిశెట్టి వేణు, విద్యార్థి విభాగం అధ్యక్షులు యం.ఏ అరిఫ్, కౌన్సిలర్లు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.