J.Surender Kumar,
దళిత బంధు పథకం నిధులతో లబ్ధిదారులు నిర్వహిస్తున్న వ్యాపారాల తీరుతెన్నులపై జగిత్యాల కలెక్టర్ రవి మంగళవారం గ్రామాల్లో వ్యాపార యూనిట్లను, పరిశీలిస్తూ, క్షేత్రస్థాయిలో పర్యటించారు.

జగిత్యాల రూరల్ మండలం లోని తిమ్మాపూర్, పొలాస ,చల్గల్ గ్రామాలో, జగిత్యాల అర్బన్ మండలం లో గాంధీనగర్ , రాయికల్ మండల కేంద్రం, కుమ్మరిపల్లి వడ్డే లింగాపూర్ గ్రామాల్లో పర్యటించారు.

దళిత బంధు పధకంలో లబ్ధిదారుల ఎంపిక కాబడిన యూనిట్లు గ్రౌండింగ్ చేసారా ? లేదా ? ఏవిదంగా చేస్తున్నారు విషయంపై కలెక్టర్ స్వయంగా లబ్ధిదారుల నుండి వివరాలను ,వారి వ్యాపార ఆలోచనలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన నగదు వినియోగం అమలు తీరు పై కలెక్టర్ స్వయంగా పరిశీలించి లబ్ధిదారులకు తగు సూచనలు ఇచ్చారు.

లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అయిన నగదు వివరాలు వారికి తెలుపుతూ వెంటనే ఆయా యూనిట్లకు సంబంధించిన కిరాణా ,సూపర్ మార్కెట్, మొబైల్ హోటల్ & క్యాటరింగ్ సర్వీసెస్ లకు అవసరమైన సివిల్ పనులు , వుడెన్ కాబోర్డ్స్, మొదలైన పనులు మొదలు పెట్టాలని కలెక్టర్ సూచించారు. భవన నిర్మాణ పరికరాల సామగ్రి, మెడికల్ ఏజెన్సీ, బ్యూటీపర్లర్, ఫోటోగ్రఫీ, మెడికల్ షాప్,ల్యాబ్ వంటి యూనిట్ల ను పరిశీలించిన కలెక్టర్ ఆయా రంగాల్లో లబ్ధిదారుల అనుభవాలను వారిని అడిగి తెలుకున్నారు.

కలెక్టర్ తన పర్యటన లో గ్రామాల్లో పారిశుధ్యం, మురికి కాలువల పరిశుభ్రత, కూరగాయల మార్కెట్ పరిసరాలను పరిశీలించారు. గ్రామ కార్యదర్శులు పారిశుధ్యం పై ఎక్కువ శ్రద్ద వహించి గ్రామాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో జగిత్యాల ఆర్.డి.ఓ. మాధురి, ఈడి ఎస్సి కార్పొరేషన్ కె.లక్ష్మీ నారాయణ, తసీల్దార్లు, ఎం.పి.డి.ఓ.లు,ఎం.పి.ఓ.లు, కార్యదర్శులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
MLC కవిత పరామర్శ…

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమేష్ కుమార్ మాతృమూర్తి శ్రీమతి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. మంగళవారం పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి హైదరాబాద్ లోని సోమేష్ కుమార్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, మినాక్షి సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.