అంగారక సంకష్ట చతుర్థి పర్వదినం సందర్భంగా శ్రీలక్ష్మి నరసింహ స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో గల శ్రీ ఈశాన్య గణపతి ఆలయంలో. మంగళవారం అంగారక సంకట చతుర్థి పర్వదినం పురస్కరించుకొని. వేద పండితులు గణపతి ఉపనిషత్తులతో అబిషేకం చేశారు.

హరతి, మంత్రపుష్పం , ఇచ్చారు పూజా కార్యక్రమాలు వేద మంత్రాల ఘోషలో ఘనంగా జరిగాయి. వేదపండితులు పాలెపు ప్రవీణ్ శర్మ, ముత్యాల శర్మ , స్థానిక వేదపండితులు మధు రామశర్మ ,అర్చకులు బొజ్జ రాజగోపాల్, విశ్వనాథశర్మ ,,సాయికుమార్, ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ కమిటీ సభ్యుడు ఇందారపు రామయ్య, భక్తులు పాల్గొన్నారు.

నరసింహుని స్వామీ నీ దర్శించుకున్న
సినీ హీరో గోపీచంద్ !
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ని మంగళవారం ప్రముఖ హీరో గోపీచంద్, డైరెక్టర్ మారుతి లు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామివారల దర్శనానికి వచ్చిన వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, ఆలయ రెనివేషన్ కమిటీ అధ్యక్షులు ఇందారపు రామయ్య, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రదానాలయంలో హీరో గోపిచంద్, డైరెక్టర్ మారుతిల పేరిట వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేదపండితులు వైదిక ఆశీస్సులు అందించారు. తరువాత అనుబంధ అలయాలలోని స్వామివారలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ, ,క్షేత్ర చరిత్ర, విశేషాలను గోపిచంద్ అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని పరిసరాల పరిశుభ్రతపై ఆనందం వ్యక్తం చేశారు. దేవస్థానంలో కొనసాగుతున్న ఉచిత అన్నదాన కార్యక్రమనికి హీరో గోపిచంద్ రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. . ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి

మాట్లాడుతూ..గోపిచంద్, రాశీఖన్నా హీరో,హీరోయిన్లుగా యువి క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రం జులై1న విడుదల కానుందని తెలిపారు. సినిమా సక్సెస్ కావాలని,.ప్రేక్షకుల ఆదరణ పొందాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.
హీరో గోపీచంద్ మాత్రం కేవలం స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము అన్నారు తప్ప, సినీ పరిశ్రమ గురించి, త్వరలో విడుదల కానున్న చిత్రాల గురించి ,ఆయన ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకపోవడం గమనార్హం. అయితే ఈ క్షేత్రంలో మంగళవారం కుజ దోషం నివారణ హోమం చేయడం ప్రత్యేకత, కుజదోషం ఉన్నవారు హోమంలో పాల్గొనకపోయినా, స్వామివారిని దర్శించుకుంటే కుజదోష నివారణ జరుగుతుందని భక్తుల విశ్వాసం నమ్మకం..

ధర్మపురి ఆలయం కు హీరో, హీరోయిన్ల తాకిడి !
గత మూడు దశాబ్దాల క్రితం ప్రముఖ సినీ హీరో కాంతారావు,. ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం, ఇటీవలికాలంలో ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ, తనికెళ్ళ భరణి, ఆర్ పి పట్నాయక్, హీరోయిన్ అమని, ప్రభ, ఝాన్సీ, రష్మి గౌతమ్, జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, నటీనటులు ఈ నెల విడుదల . కానున్న ” 1996 ధర్మపురి ” చిత్ర హీరో గగన్ విహారి, హీరోయిన్ అపర్ణాదేవి, తదితరులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
